శివానందరూపం శివోహం శివోహం

శైవమొక్కటే సమానత్వం
శైవమొక్కటే ప్రేమతత్వం
శైవమొక్కటే శాంతిధామం
శైవమొక్కటే భారతీయం
శివానందరూపం శివోహం శివోహం
సదానందదీపం శివోహం శివోహం

నద్రోహం నక్రోధం
నకౌర్యం నద్వేషం
నభేదం నఖేదం
నమోహం నమోసం
“శివానందరూపం”

నరాగం నగర్వం
నతిమిరం నమూఢమ్
నప్రళయం నగ్రహణం
నక్రూరం నదౌష్ట్యం
“శివనందరూపం”

నదుఖః నభయం
నకామం నమాయం
నక్లిష్టం నమౌడ్యం
నవ్యర్థం ననర్థం
“శివానందరూపం”

సృష్టిమూలం శక్తిరూపం
కాంతికిరణం సుగతిభరణం
గరళహరణం గానమధురం
జలనచలనం వాయుపయనం
ధరణిభ్రమణం అగ్నిజ్వలనం
జ్ఞాననేత్రం మనోచిత్రం
“శివానందరూపం”

ధూర్తశిక్షణ సత్యరక్షణ
ప్రగతిధారణ ముక్తిమార్గం
అర్ధనారీ సమానత్వం
నిరాడంబర జీవనత్వం
మొహమర్దన మనోచిత్తం
సత్యశోధన సదానిత్యం

శివానందరూపం శివోహం శివోహం
సదానందదీపం శివోహం శివోహం

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest