బెంగళూరు
బాల బాబాయ్ అన్న పిలుపు ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నాఅని బాలకృష్ణ కన్నీరు మున్నీరయ్యారు. బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నా. నందమూరి అభిమానులకు, టిడిపి కుటుంబ సభ్యులకు తారకరత్న మరణం తీరని లోటు. నటనలోనూ తనకు తాను నిరూపించుకున్నాడు. కఠోరంగా మృత్యువుతో పోరాడుతున్నప్పుడు మృత్యుంజయుడై తిరిగి వస్తాడు అనుకున్న తారకరత్న ఇక కానరాని లోకాలకు వెళ్ళాడు. తారతరత్న ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలి.
తారకరత్న మృతికి కంభంపాటి రామమోహన రావు సంతాపం
ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న మృతి బాధాకరం.. ఎన్టీఆర్ మనవడైనా ఎంతో నిరాడంబరంగా ఉండేవారు, అందరితో కలుపుగోలుగా ఉండేవారు.
అభిమానుల ప్రార్ధనలు ఫలించి పూర్తి ఆరోగ్యంతో తిరిగివస్తారని ఆశించాం. తారకరత్న ఇక లేరనే వార్త తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
ఆయన ఆత్మశాంతికి భగవంతుని ప్రార్ధిస్తున్నాను. నందమూరి అభిమానులకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
కంభంపాటి రామమోహన రావు(మాజీ ఎంపి)
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.