విజయవాడ
పోతిన వెంకట మహేష్ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి
రాష్ట్రం లో ఏడు ప్రధాన ఆలయాల్లో పచారీ సామాన్ల కాంట్రాక్టు లో ఐదు వందల నుంచి ఆరువందల కోట్ల దోపిడీ జరుగుతుంది. వైసిపి నాయకులు, దేవాదాయ శాఖ మంత్రి కనుసన్నల్లో ఈ అక్రమాలు చేస్తున్నారు. జగన్ ప్రోత్సాహం లేకుండా ఈ దోపిడీ సాధ్యమా?2016లో ఒక సర్క్యూలర్ ఆధారంగా దేవాదాయ మంత్రి నిబంధనలు మార్చారు. వైసిపి కాంట్రాక్టర్లు కు దోచి పెట్టడానికి పది కోట్ల టర్నోవర్ నిబంధన తెచ్చారు. గతంలో ఐదు కోట్ల టర్నోవర్ నిబంధనను ఎందుకు మార్చారు. భూపేష్, రూపేష్,- మణికంఠ ఎంటర్ ప్రైజెస్ సంస్థ లను ముందు పక్కన పెట్టాలి. ఒక యేడాది కి 125-150కోట్లు ఈ కాంట్రాక్టర్లు కొట్టేస్తున్నారు. ఇదంతా జగన్ ఆదేశాలతో దేవాదాయ శాఖ మంత్రి ప్రోత్సహిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ కూడా పెద్ద బూటకం … అది పేరుకే ఇంత దోపిడీ జరుగుతుంటే నిఘా విభాగం ఏం చేస్తుంది?అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, దుర్గగుడికి ఒకే కాంట్రాక్టర్ వేర్వేరు ధరలతో 75రకాల సరుకులు ఇస్తున్నాడు. అధికారులు కళ్లు మూసుకుని పని చేస్తున్నారా?భక్తులు ఆలయాలకు ఇచ్చే డబ్బులను ఇటువంటి కాంట్రాక్టర్లు కు దోచి పెడతారా?వందల కోట్లు కొట్టేస్తే ఇక అలయాల అభివృద్ధి ఎలా చేస్తారు. స్వామిజీలు కూడా స్పందించాలి…ప్రభుత్వాన్ని నిలదీయాలి. 75రకాల సరుకులను పది మందికి ఇచ్చేలా నిబంధనలు మార్చాలి. ప్రభుత్వం స్పందించకుంటే జనసేన పక్షాన ఉద్యమిస్తాం.