ఎమ్మెల్యేల కదలికల పై నిఘా

అమరావతి :

ఈ నెల 23వ తేదీన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పై ఇంటలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో 7 ఖాళీలు ఉన్నాయి. 8 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో వైసీపీ సర్కారు అప్రమత్తమైంది. తమ పార్టీలో అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో నిఘా పెట్టింది. ఈ నేపధ్యలోనే ఇరు పార్టీల నేతలు విప్ జారీ చేసారు. పట్టా భద్రుల ఎమ్మెల్సీ ఫలితాల ఎఫెక్ట్ తో వైసీపీ తమ పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా పెట్టిందనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest