బెల్లంపల్లి :
బి ఆర్ ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆ పార్టీ ఆసిఫాబాద్ , మంచిర్యాల జిల్లాల ఇంచార్జ్ నారదాసు లక్ష్మణ్ సూచించారు. బెల్లంపల్లి లో సోమవారం బి ఆర్ ఎస్ పార్టీ విస్తృత సాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన నారదాసు లక్ష్మణ్ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రలవద్దకు తీసుకుని వెళ్లాలని అన్నారు. బి ఆర్ ఎస్ పై ఇతరపార్టీలు చేసే ఆరోపణలను తిప్పి కొట్టాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్ , బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నిరంజన్ , డైరెక్టర్లు, నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, PACS చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి మండలాల, గ్రామాల అధ్యక్షులు, సభ్యులు, BRS, BRSY, BRSV మరియు అనుబంధ కమిటీల నియోజకవర్గ, మండలాల, గ్రామాల, పట్టణ మరియు వార్డుల అధ్యక్షులు, సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.