సినిమాకు నేడు గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయింది. పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్థాయికి ప్రాంతీయ సినిమా ఎదిగింది. దానికి తగ్గట్టుగానే ప్రేక్షకుడి ఆలోచన మారింది, సినిమాలను చూసే కోణం మారింది. మూవీ లవర్స్ అభిరుచికి తగ్గట్టుగానే నేటి తరం దర్శకులు తెరకెక్కించే చిత్రాల్లో ఆ వైవిధ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వినుత్నమైన సినిమాలను అలరించే ప్రేక్షకుల కోసం ఎంతో వైవిధ్యబరితమైన అంతే కొత్త కథతో వస్తున్న సినిమా రేవ్ పార్టీ.
బోనగాని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజు బోనగాని దర్శకత్వ సారథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషలలో చీత్రికరన జరుపుకోవడానికి అంతా సిద్దం చేసుకొని ఉగాది సందర్భంగా అతిరథమహారదుల సమక్షంలో మార్చి 24 శుక్రవారం పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్, టైగర్ నాగెశ్వర్ డైరెక్టర్ వంశీ, మేజర్, గుఢాచారి డైరెక్టర్ శశికిరణ్ టిక్కా, యుఎఫ్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రంతో క్రిష్ సిద్దిపల్లి హీరోగా నటిస్తున్నారు . ఇంకా ఈ సినిమాలో సుచేంద్ర ప్రసాద్, తారక్ పొన్నప్ప, ప్రతిమ తదితరలు నటిస్తున్నారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫర్ గా వెంకట్ మన్నం, సంగీత దర్శకుడిగా దిలీప్ బండారి లు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదలైన పోస్టర్ అందరిలో గొప్ప ఆసక్తిని రేపుతుంది పోస్టర్లో డ్రగ్స్ పార్టీకి సంబంధించిన విజువల్స్ యూత్ ని అట్రాక్టివ్ ఆకర్షించే విధంగా పోస్టర్ డిజైనింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ రాజు బొనగాని మాట్లాడుతూ.. స్ట్రైట్ కన్నడ ఫిల్మ్ తీస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. కన్నడాలో చిత్రీకరించిన తరువాత ఈ సినిమాను మిగితా భాషాలో పాన్ ఇండియా స్థాయిలో విడుదుల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా ఎప్రిల్ 3 నుంచి షూటింగ్ ప్రారంభించి షరవేగంగా ఒకే ఒక షెడ్యూల్ లో చిత్రాన్ని తెరకెక్కించాడనాకి అన్ని రకాల సన్నహాలు చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు రాజు బొనగాని తెలిపారు. రేవ్ పార్టీ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమానికి హాజరు అయిన పాన్ ఇండియా నిర్మాత అభిషేక్ అగర్వాల్, డైరెక్టర్లు వంశీ, శశికిరణ్ టిక్కా తదితరులకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
మాములుగా మనం చాలా రకాల రేవ్ పార్టీల గురించి వార్తల్లో చదువుతూ ఉంటాం, సోషల్ మీడియాల్లో చూస్తూ ఉంటాం. అయితే అసలు రేవ్ పార్టీలో ఏం జరుగుతుంది. ఆ పార్టీలో యూత్ ఎలా ప్రవర్తిస్తుంటారు అంటే ఆ పార్టీలో యూత్ వాడే డ్రగ్స్ ఏంటీ, అవి ఎలా తీసుకుంటారు. ఈ రకమైన సంప్రదాయాన్ని పోలిటిషియన్స్ ఎందుకు ప్రొత్సహిస్తున్నారు. దాని వెనుక రాజకీయ నాయకుల అజెండా ఏమిటి అన్న విషయాలు, ఇలాంటి పార్టీల మూలంగా యువత జీవితంలో ఎలాంటి మలుపులు వస్తాయి అనే పాయింట్ తో చాలా రియాల్టీగా, ఆద్యాంతం ఉత్కంఠబరితంగా.. ప్రతీక్షణం తీక్షణంగా చూసేంత సస్పెన్స్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఉడిపి, గోవా, మణిపాల్ లాంటి ప్రాంతాలలో ఎక్కువ ఈ రకమైన పార్టీలు జరుగుతుంటాయి, అందుకోసం ఈ చిత్రాన్ని ఆ ప్రదేశాలలోనే చీత్రికరించాడానికి షెడ్యూల్ ఖరారు చేస్తున్నట్లు చెప్పారు. సినిమా మొదలు పెట్టిన తరువాత ఏకదాటిగ చిత్రీకరణ పూర్తి చేసి ఇండియా వైడ్ గా అన్ని భాషల్లో బలమైన ప్రచారాన్ని చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లు ఈ సందర్భంగా దర్శకుడు రాజు బొనగాని మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
రేవ్ పార్టీ సినిమా హీరో క్రిష్ సిద్దిపల్లి మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని కల్పించిన డైరెక్టర్ రాజు బొనాగానికి, చిత్ర నిర్మాతలకు కృజ్ఙతలు తెలిపారు. అలాగే తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, తన శక్తికి మించి క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టి తెరపై ఇంకా ఉన్నతంగా కనిపించేలా నటిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమానికి వచ్చిన నిర్మాత అభిషేక్ అగర్వాల్, డైరెక్టర్లు వంశీ, శశికిరణ్ టిక్కా తదితరులకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇక చిత్రానికి ఎడిటర్ గా రవి కుమార్ కె, డైలాగ్ రైటర్స్ గా సూర్య-ప్రేమ్ బీఎస్ లు, ఆర్ట్ డైరెక్టర్ గా వెంకట్ ఆరే, కో డైరెక్టర్ గా నాగరాజు నాయక్ డీ, పబ్లిసిటీ డిజైనర్ గా లక్కీ, ఇక సహా నిర్మాతలుగా లక్ష్మీకాంత్ ఎన్ఆర్, జయరామ్ డీఆర్, సీతారామరాజు జి ఎస్, నారయాణ స్వామి ఎస్ లు పనిచేస్తున్నారు. ఎప్రిల్ లో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకు ఇండస్ట్రి నుంచి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 126