హైదరాబాద్
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిజం చేసేందుకు ఆవిర్భవించిన టిఆర్ఎస్ పార్టీ 22 ఏండ్ల అనతికాలంలోనే తన స్వరాష్ట్ర ఏర్పాటు లక్ష్యాన్ని సాధించమే కాకుండా దేశానికే ఆదర్శంగా ప్రజా పాలనను అందిస్తూ ప్రగతి పథాన ముందుకు సాగుతున్నదనీ., దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేదిశగా బిఆర్ఎస్ గా గుణాత్మక మార్పుచెంది వొక చారిత్రక దశలోకి ప్రవేశించిన సందర్భంలో 23 వ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం మనందరికీ గర్వకారణమనీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. గుణాత్మక రాజకీయాలతో దేశంలో ట్రెండ్ సెట్ చేయడం కోసమే బిఆర్ఎస్ పార్టీ పరిణామ క్రమంలో ముందుకు వచ్చిందన్నారు. భారత దేశానికి బిఆర్ఎస్ ను వొక వెలుగుదివ్వెగా తీసుకుని పార్టీ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తామని అధినేత సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
• 75 ఏండ్ల స్వతంత్ర భారత పార్లమెంటరీ పంథాలో గులాబీ జండానెత్తుకుని తెలంగాణ బిడ్డలు అనుసరించిన ప్రజాస్వామిక ఉద్యమ కార్యాచరణ అత్యంత క్లిష్టమైన తెలంగాణ రాష్ట్రం సాధన లక్ష్యాన్ని చేరుకుని, తొమ్మిదేండ్ల అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో దేశానికే ఆదర్శంగా ముందుకు నడిపిస్తున్నదని సిఎం తెలిపారు. గుణాత్మక రాజకీయాలతో ట్రెండ్ సెట్ చేయడం కోసమే బిఆర్ఎస్. భారత దేశానికి బిఆర్ఎస్ ను వొక వెలుగుదివ్వెగా తీసుకుని ముందుకు పోదాం.
పార్లంమెంటరీ పంథాలో దేనినైనా సాధించవచ్చని ప్రపంచానికి చాటిచెప్పామని సిఎం స్పష్టం చేశారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం నాడు తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ సుప్రీమో సిఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ప్రతినిధుల సమావేశం జరిగింది.
గురువారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్కు చేరుకున్న అధినేత, సిఎం కేసీఆర్ గారు..తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదుపరి సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన ప్రతినిధుల సభకు చేరుకున్నారు.
• పార్టీ సెక్రటరీ జనరల్ ఎంపీ కే. కేశవరావు ప్రసంగం తో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. అనంతరం బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు సిఎం కేసీఆర్ గారి ప్రసంగం కొనసాగింది. చివరిగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటిఆర్ తీర్మానాలను ప్రవేశ పెట్టడంతో మొదటి సెషన్ పూర్తయింది. తీర్మానాలు ప్రవేశపెట్టిన అనంతరం.. లంచ్ బ్రేక్ ఇచ్చారు.
• మధ్యాహ్నభోజనాలు ముగిసిన అనంతరం..మధ్యాహ్నం 2:30 గంటలకు సమావేశం తిరిగి ప్రారంభమైంది.
మంత్రి కెటిఆర్ ప్రవేశ పెట్టిన తీర్మానాలను ఆమోదించేందుకు అధ్యక్షుల అనుమతితో నేతలు ప్రసంగించారు.
ఈ సందర్భంగా….ఎమ్మెల్సీ రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మొదటగా తీర్మానాలను బలపరుస్తూ ప్రసంగించారు. అనంతరం… ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాతా మధు, జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్, మంత్రి జగదీశ్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లు…. కెటిఆర్ ప్రవేశ పెట్టిన రాజకీయ తీర్మానాల పై ప్రసంగించి ఆమోదించాలని సభను కోరారు. ఈ సందర్భంగా చప్పట్లతో సభ ఆమోదం తెలిపింది.
అనంతరం…..దళితబంధు పథకం.. 125 అడుగుల డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, సచివాలయానికి డా బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నామకరణం….రాష్ట్రంలో గురుకులాల ఏర్పాటు సహా దళితులకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యాచరణ పై తీర్మానాలను ..మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానాలను బలపరుస్తూ సభను ఆమోదించాలని కోరుతూ.. ఎస్సీ డెవలప్ మెంట్ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ఎమ్మెల్యే సండ్రవెంకట వీరయ్య, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ మధుసూధనాచారి,ఎమ్మెల్యే విప్ బాల్క సుమన్ లు సభలొ ప్రసంగించారు. కాగా సభ చప్పట్లతో తీర్మానాలను ఆమోదించింది.
అనంతరం ఆంధ్ర ప్రదేశ్ బిఆర్ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ తీర్మానాలన బలపరుస్తూ ప్రసగించారు.
ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు… మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా…బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రసంగం – ముఖ్యాంశాలు:
• రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం
• పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలియజేయగలిగినం.
• అదే పంథాలో అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నాం.
రైతులను వ్యవసాయాన్ని ఆదుకుంటాం :
• వ్యవసాయాన్ని నిలబెట్టాలనేదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. ఎన్ని కష్టాలొచ్చినా వ్యవసాయాన్ని ఆదుకుంటాం. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పునరావాస సాయం అందచేస్తాం. రైతుల ఆత్మస్థైర్యం ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతిననీయం. రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తున్నది. రాల్లవానలతో పంటల నష్టం గురించి మీమీ జిల్లా కలెక్టర్లతో నివేదికలు తెప్పించుకోండి.
• కేంద్రం చేసే సాయం దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టుగా వుంది. తెలంగాణ రైతులకు కేంద్రం మీద ఆశలు ఏనాడు లేవు. అవసరానికి అక్కెరకొచ్చే పరిస్థితి కేంద్రానికి లేదు కావట్టే రాష్ట్ర ప్రభుత్వమే ఎంత కష్టమైనా నష్టమైనా భరించాలని నిర్ణయించుకున్నది.
• తెలంగాణ రైతు కాలుకు ముల్లుగుచ్చుకుంటే తీయడానికి సిధ్దంగా వున్నది.ఎకరాకు 10 వేల రూపాయల పునరావాస సాయం ప్రకటించడం భారత దేశ వ్యవసాయ రంగంలోనే మొట్టమొదటిసారి.ధాన్యాన్ని కూడా గింజలేకుంటున్న కొంటున్న ప్రభుత్వం కూడా మనదే.
• తెలంగాణ పచ్చబడ్డది ..పల్లెలు సల్లబడ్డయి..పోయిన వలసలు తిరిగి వస్తున్నయి.
• కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించాక అనేక రాష్ట్రాల మోడల్స్ తెప్పిచ్చి మనం ఎలా ముందుకుపోవాలని మేధోమదనం చేసాను. కానీ నాటి పరిస్థితిని పరిశీలిస్తే ఆ రాష్ట్రాలకన్నా తెలంగాణ ఎంతో ముందంజలో వున్నది నేడు.
• మన పార్టీ రైతు పార్టీ గా మారింది. మనం ఇక రైతు రాజ్యాన్ని నడిపించుకుందాం.
• మహారాష్ట్ర బడ్జెట్ ఎంతకూ ఎదగకపోవడానికి కారణం అక్కడి పాలకులు విజన్ లేకపోవడమే. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ.
• తెలంగాణ జీఎస్డీపిలో వ్యవసాయరంగం వాటా 23 శాతానికి చేరుకోవడం గొప్ప విషయం.
• అకాలవర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యేలా వ్యవసాయశాఖ రైతులను చైతన్యం చేయాలి.
• మక్కలు, జొన్నలు అన్ని పంటలు కూడా గతంలో మాదిరి కొంటాం. మార్క్ ఫెడ్ కు ఈ మేరకు ఆదేశాలిస్తం.
• మనం అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తే దివాలా తీస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. కానీ తెలంగాణ ఎందుకు దివాలా తీస్తలేదు ?
• తలసరి ఆదాయంలో మహారాష్ట్ర, తమిళనాడును దాటవేసి ముందుకు పోతున్నాం.
• తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది.
తెలంగాణ రాష్ట్రం లో పాలన కానీ సామాజిక రాజకీయ శాంతి భధ్రతల పరిస్థితులు పెట్టుబడులకు అనుకూలంగా వున్నాయి. అందికే విశ్వవ్యాప్తంగా పెట్టుబడులు వస్తున్నయి.
• మన మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకంగా పనిచేస్తుండటంతో రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నయి.
• ఎపి తలసరి ఆదాయం రూ. 2,19,518. ఇది మనకన్నా లక్ష రూపాయలు తక్కువ. ఇంతకన్నా తక్కువ రాష్ట్రాలు 16, 17 వున్నాయి.
• 2021-2022 కు ముందు జీఎస్టీ ఆదాయం 34 వేల కోట్లు వుంటే, అంచనా 44 వేల కోట్లు పెట్టుకున్నం. కానీ 54 వేల కోట్లు సాధించాం.
తెలంగాణ రోజు రోజుకూ ఆర్థిక వనరులు పెరుగుతున్నాయనడానికి జీఎస్టీ వసూల్లు మంచి ఉదాహరణ.
త్వరలోనే పాలమూరు రంగారెడ్డి సహా సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటం,. తెలంగాణలో పూర్తిస్తాయి సాగునీటి వసతులు పూర్తవుతాయి.
• తెలివి ఉంటే బండమీద నూకలు పుట్టించుకోవచ్చు.
• ప్రచార సాధనాలను మెరుగు పరుచుకోవడం….పార్టీ శ్రేణులతో మమేకమవ్వడం..వారి కష్ట సుఖాలను తెలిసుకోని కలుపుకపోవడం చేయాలి : అధినేత కేసీఆర్
ఆత్మీయ సభల నిర్వహణ నియోజక వర్గాలవారీగా సభలు విజయవంతంగా జరిగాయి . అందుకు పార్టీశ్రేణులను వర్కింగ్ ప్రసిడెంటుకు అభినందనలు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షలమంది ఈ సమావేశాల్లో పాల్గొన్నట్టు నాకు సమాచారమున్నది. మనం పనులు బాగా చేస్తున్నం కానీ ప్రచారం లేదు అని అంటున్నరు మన శ్రేయోభిలాషులు. చేసిన పని చెప్పుకోవాలె. మీరు కూడా నావోతిగనే వుంటెట్ల..?
• ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలి.
ప్రచార వ్యవస్థలను ఎవరికివారుగా మెరుగుపరుచుకోవాలె. ప్రతినిత్యం ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజలకు చేర్చేలా చర్యలు చేపట్టండి.
• మన ప్రగతి గురించి సానుకూలంగా పాజిటివ్ గా ఆలోచించే మీడియాను పత్రికలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరమున్నది. మన పదేండ్ల పాలనలో వొక్కో గ్రామానికి పథకాల రూపంలో ఎన్ని డబ్బులు అందినాయి. లబ్ధిదారులకు ఎట్లా అవి ఉపయోగపడుతున్నాయనే విషయం పై దృష్టి సారించండి.
• అక్కడో ఇక్కడో కేడర్ లో అసంతృప్త్తిని వుంటే వాటిని తగ్గించే చర్యలు చేపట్టండి.
• మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో 100 కు పైగా గెలుస్తాం.
• పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలి.
• కరెంటు, రోడ్లు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, పశుసంపద, మత్స్య సంపద ఇలా ప్రతీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశమే ఆశ్చర్యపోయే ప్రగతిని నమోదు చేసింద.
• తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసేందుకు మహారాష్ట్ర వాళ్లు సొంత బండ్లేసుకుని వచ్చి చూసిపోతున్నారు.
• మనం చేసినట్టు ప్రజలకు అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రమూ చేస్తలేదు.
• బస్తీల వారిగా వార్డుల వారీగా పల్లెల్లో పట్టణాల్లో,,,నియోజకవర్గాల వారిగా తిరిగి సమీక్షలు నిర్వహించండి. నివేదికలు పార్టీ కార్యాలయానికి పంపండి. రాబోయే పదిరోజుల్లో ప్రజలతో సమీక్ష కార్యక్రమం ముగియాలి. తద్వారా తగిన వ్యూహం తో ప్రజల్లోకి వెల్లండి.
ముఖ్యమైన పథకాల్లో పారదర్శకంగా కొనసాగాలి. ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి తావివ్వకూడదు.
• 3 లక్షల గృహలక్ష్మి పథకం…దళితబంధు అమలు…గొర్రెల పంపిణీ…పోడుభూముల పట్టాలు…58,59 జీవోల ప్రకారం క్రమబద్దీకరణ..ఇవి సామాన్యులకు పేదలకు లబ్ధి చేకూర్చే పథకాలు. వాటిని అత్యంత క్రమశిక్షణతో అమలు చేయించాల్సి వుంటుంది. ఎటువంటి తేడాలు రానివ్వద్దు. వస్తే కఠిన చర్యలుంటాయి.
• పేదలకు పంచేందుకు గతంలో జాగాలు సమీకరిస్తే వాటిని వెంటనే పంపినీ చేయాలి. హైద్రాబాద్ లో నోటరీ భూములను కూడా క్రమబద్దీకరిద్దాం. కొత్త సెక్రటేరియట్ లో ఇందుకు సబంధించిన ఫైల్ల మీద సంతకం చేస్తా.
గృహలక్షి పథకం :
• 3 లక్షల రూపాయలిచ్చే గృహలక్ష్మి పథకం కోసం త్వరలోనే విధివిధానాలు విడుదలవుతాయి. సొంత జాగాలున్నవాల్లకు, ప్రభుత్వం ఇచ్చిన భూముల పట్టాలున్నవాల్లకుకూడా కట్టిస్తం. ఇంకా కొన్నిగ్రామాల్లో ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. వాటి సర్వే చేసి నివేదికలు ప్రభుత్వానికివ్వండి.ఇండ్లు కట్టుకోవటానికి యోగ్యంగా వుంటే వాటిని తక్షణమే వాటిని అర్హులైన పేదలకు పంచుదాం…తద్వారా వాల్లు ఇండ్లుకట్టుకుంటారు.
• ఈ ప్రక్రియను త్వరలో పూర్తి చేయండి. మన శాసనసభ్యులు లేని చోట జడ్పీ ఛైర్మన్లు, ఎంపీలు, జిల్లా ఇంచార్జిలుగా ఉపయోగించుకోవాలి. ఈ 3,4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలి.
• మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు. మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనేది ప్రాధాన్యతాంశం.
• ఎలక్షన్ షుడ్ బి నాట్ బై చాన్స్… బట్ బై చాయిస్…
• దూపయినప్పుడు బావి తవ్వుతం అనే రాజకీయం నేడు కాలానికి సరిపోదు.
• రాబోయే ఎన్నికల్లో తప్పక ఘన విజయం సాధిస్తాం.
• బిఆర్ఎస్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టివి యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా మన పార్టీ నుండి భవిష్యత్తులో చేపట్టవచ్చు.
• అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టివి ఛానల్ ను కూడా నడపవచ్చు.
నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం :
• కొత్త సెక్రటేరియట్ ప్రారంభం సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు గం. 12.45 కల్లా అక్కడికి చేరుకొండి.
పుష్కర అంశలో ప్రారంభం జరుగుతుంది.
• గం. 1.58 నుంచి గం. 2.04 వరకు మంత్రులు వారి వారి చాంబర్స్ కు పోవాలి.
• సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్ లోబ్రీఫ్ మీటింగ్ వుంటుంది. ఆతర్వాత లంచ్ చేసి కార్యక్రమం ముగుస్తంది.
• మెయిన్ గేట్ గుండా సీఎం, మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యేలకు ఉద్దేశించింది.
• 3 గేట్లు, నార్త్ ఇస్ట్ గేట్ అధికారుల రాకపోకలకు ఉద్దేశించింది
• సౌత్ ఇస్ట్ జనరల్ విసిటర్స్ కు ఉద్దేశించింది.
బీసీ జన గనణ చేపట్టడానికి కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నది..? తక్షణమే జన గనణ చేపట్టాలి.
ప్రపంచ యుద్దాల సమయంలో కూడా జన గణన ఆపలేదు..మరి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎందుకు ఆపుతున్నదో ప్రజలకు చెప్పాలె. దీన్ని కూడా మత విద్వేశాలతో కాలయాపన చేస్తూ పక్కకు పెడుతున్నరు.
అంబేద్కర్ మహాశయుడు విశ్వమానవుడు.
తెలంగాణ రాష్ట్రం తన దార్శనికతతోనే సాధ్యం అయింది. ఇదే విషయాన్ని నీను పలు మార్లు చెప్పిన కూడా. రాజ్యాంగ రచన సందర్భంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంశం వచ్చినపుడు…అసెంబ్లీలో మెజారిటీ అభిప్రాయం కూడదు అని చెప్పిన దార్శనికుడు అంబేద్కర్. ఆయన ఆలోచనే ఇవాల తెలంగాణ రాష్ట్రాన్ని సాధకు మూలమైంది. అందుకే అంబేద్కర్ స్పూర్తివంతమైన మూర్తిని నిలబెట్టకున్నం. సచివాలయానికి కూడా వారి పేరుపెట్టుకుని వారి ఆశయాల సాధాన దిశగా ముందుకు పోతున్నం. అంబేద్కర్ పేరు పెట్టడంతో మన తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి మరింతగా ఇనుమడించింది,.
ప్రజలు నాయకుల లక్ష్యశుద్ది ని పరిశీలిస్తరు …చిల్లర మల్లర రాజకీయ విమర్శకులకు పనిచేసే మనం ప్రభావితం కావద్దు.
దళితబంధు సామాజిక పెట్టుబడి :
దళిత బంధు కు పెడుతున్న పెట్టుబడి అది వ్యక్తిగతంగా కాకుండా సమాజ సంపదను పెంచే సామాజిక పెట్టుబడిగా మారుతుంది. ప్రభుత్వం పంచుతున్న డబ్బు గ్రామాల్లో తిరిగి సమాజానికి చేరుతుంది. ఇదే స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటారు. రాబోయే కాలంలో 6 లక్షల కోట్లకు తెలంగాణ బడ్జెట్ పెరుగుతందనడంలో అతిశయోక్తి కాదు. ఎన్ని కష్టాలొచ్చినా దళితబంధు పథకం కొనసాగుతనే వుంటది.
దీని మీద విద్యార్ధులు రీసెర్చ్ స్టడీ చేయాల్సిన అవసరమున్నది. దళితుల్లో వజ్రాలను వెలికితీసే పథకం దళిత బంధు పథకం. నేడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల మీద వత్తిడి పెంచుతున్నది.
మన పార్టీ ఫండ్ నేటికి 1250 కోట్ల రూపాయలకు చేరింది. ఇందులో 767 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసినం. తద్వారా నెలకు 7 కోట్ల రూపాయల వడ్డీ వస్తున్నది. దీంతో పార్టీని నడుపడం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు, ప్రచారం, మౌలిక వసతుల కల్పన కోసం తదితర ఖర్చులు చేపడుతున్నం.
• ఈ సందర్భంగా….పార్టీ ఆర్థిక వ్యవహారాలన పై తీర్మానాన్ని సభ ఆమోదించింది.పార్టీ ఆర్థిక వ్యవహారాలను అధ్యక్షులే చూసుకుంటారు. ఇతర రాష్ట్రాల్లో ఖాతాలను తెరవడం, కోశాధికారి అధ్యక్షునికి సహాయకుడిగా వ్యవహరించడం, పార్టీ ప్రచారం కోసం దేశవ్యాప్తంగా మీడియా వ్యవస్థల ఏర్పాటు తదితర తదితర పార్టీ ఆర్థిక వ్యవహారాలను పార్టీ జాతీయ అధ్యక్షునికి కట్టబెడుతూ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ చప్పట్లతో ఆమోదించింది.
• మే నెల 4 వ తేదీన ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకుందాం.
• జూన్ 1న అమరుల స్మారకాన్ని ఆవిష్కరించుకుంటం.
• 2 జూన్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలుంటాయి.
• గుణాత్మక రాజకీయాలతో ట్రెండ్ సెట్ చేయడం కోసమే బిఆర్ఎస్. భారత దేశానికి బిఆర్ఎస్ ను వొక వెలుగుదివ్వెగా తీసుకుని ముందుకు పోదాం.
• నేను త్వరలోనే వొక్కె ఎమ్మెల్యేతో కలసి మాట్లాడుత
నా ప్రసంగం ముగిసింది.
ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ తీర్మానాలను ప్రవేశ పెడుతారు.
……………………………………………………………………………….
తీర్మానాలను ప్రవేశపెట్టిన సంధర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ప్రసంగం…ముఖ్యాంశాలు :
• జల దృష్యం నుంచి సుజల దృష్యం దాకా మన పార్టీ ప్రగతి ప్రస్థానం కొనసాగుతోంది.
• ఇదంతా మన అధ్యక్షులు సిఎం కేసీఆర్ గారి దార్శనికతతోనే సాధ్యమైంది.
నీను ఇటీవల వొక పెద్ద మనిషిని కలిసినపుడు వారు …మీ ముఖ్యమంత్రిలో ఉద్యమాకారుడే కాదు మంచి పరిపాలనాధక్షడున్నారు. ఇట్లా రెండూ కలిసి వుండడం చాలా అరుదు అని కొనియడారు.
మన పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం… సమగ్ర.. సమతుల్య,,సమీకృత..సమ్మిళిత..అభివృద్ధి విధానం.
డేటా లేకుండా చేసే పాలన అనేది కరెక్టు కాదు. అనేది మన సిఎం గారు నమ్మిన అంశం. అందుకే రాష్ట్రం ఏర్పాటు కాగానే సకల జనుల సర్వే నిర్వహించి జనాభా గణాంకాలతో అభివృద్ధిని సుసంపన్నం చేశారు.
• దేశంలో 2.8 శాతం జనాభా కలిగిన తెలంగాణ అభివృద్ధి సంక్షేమంలో పంచాయితీరాజ్ శాఖలో 30శాతం అవార్డులను సొంతం చేసుకున్నది.
ప్రజలకు ఏం కావాలో వారేం కోరుకుంటారో అనేది మన అధినేతకు తెలిసినంతగా ఇతరులకు తెలవదనేది మేధావులు చెప్తున్న అంశం. అందుకే తెలంగాణ లో ఇంతటి అభివృద్ధి సాధ్యమైంది.
పల్లెలే కాదు పట్టణాలు కూడా గుణాత్మక అభివృద్ధిని నమోదు చేసుకుంటున్నాయి. పారిశ్రామీకరణ పర్యావరణ హితంగా కొనసాగుతున్నది. ధాన్యం దిగుబడి విపరీతంగా పెరిగింది. విద్య వైద్య విద్య గురుకులాలు ఏర్పాటు వేరే ఏరాష్ర్ట్రంలో కూడా ఇంతగా లేవు.
• దేశ 75 ఏండ్ల స్వాతంత్ర్య చరిత్రలో… తెలంగాణ రాష్ట్రం భారత దేశంలో వొకే వొక స్టార్టప్ స్టేట్ ఎదిగింది. ఇది మనందరికీ గర్వ కారణం.
మౌలిక వసతుల కల్పన అనేది అభివృద్ధికి మూలం అని నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ అన్నారు. దేశంలో సహజ వనరులను వాడుకునే తెలివున్న ప్రభుత్వాలే లేవు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని సిఎం కేసీఆర్ పిడికిలి బిగిస్తే దేశమంతా గొప్పగా స్పందిస్తున్నది. మహారాష్ర్ట్రలో విజయవంతమౌతున్న సభలే అందుకు నిదర్శనం.
తెలంగాణ రాష్ట్రం…శ్వేత నీలి పింక్ యెల్లో ఇట్లా 5 విప్లవాలతో ప్రగతిని సాధిస్తున్నది.
4.5 లక్షల కోట్ల రూపాయాలను కేవలం వ్యవసాయం దానికి అనుబంధ రంగాలకే ఖర్చు చేయడం దేశంలోనే ఎన్నడూ జరగలేదు.
పాలకు జిఎస్టీ వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అదానికి ఇచ్చిన పోర్టులకు ఎందుకు చేయట్లేదో చెప్పాలి.
యువతను రాజకీయాల దిశగా చైతన్యం చేయాల్సిన అవసరం వున్నది. పొద్దున లేస్తే ప్రతి అంశాన్ని,,మన జీవితాలను రాజకీయాలు ప్రభావితం చేస్తున్నప్పుడు..రేపటితరం రాజకీయాల పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరమున్నది. భారత దేశంలో మానవ వనరులున్నయి సరియైన రీతిలో దిశానిర్దేశం చేయాలె.
• అప్పులు తేవడం అనేది ఏదో తప్పుగా మాట్లాడుతున్న వాల్లు గుర్తుంచుకోవాల్సిందేందంటే…దుబారా ఖర్చుకోంస అప్పులు చేయడంలేదు…పునరుద్పాతకతకోసం చేస్తున్న అప్పు దేశ సంపదను పెంచుతది. తెలంగాణలో అదే జరుగుతున్నది. అది అప్పుకాదు పెట్టుబడి.
మన తల్లిదండ్రులు జీవితచమరాంకంలో ఇల్లు కట్టుకునే వాల్లు కానీ నేటి ఐటి తరం ఉద్యోగం రాంగనే లోన్ తెచ్చుకోని ఇల్లు కట్టుకుంటుండు. లోన్ తెచ్చుకోని వ్యాపారం చేస్తుండు. వారికి అప్పు తీర్చగలమనే భరోసా వచ్చింది కావట్టే వారు అభివృద్ధి చెందుతున్నరు,. దేశంలోని కేంద్ర పాలకులు ముఖ్యంగా బిజెపి వంటి ప్రభుత్వాలు ఈ విధానాన్ని అనుసరిస్తే దేశం ఎప్పుడో 5 ట్రిలియన్ మార్కును దాటేది.
ప్రపంచంలో అత్యంత అప్పులున్న దేశాలు …అదే సందర్భంగా అత్యంత ధనవంతమైన దేశాలు రెండూ కూడా అమెరికా జపాన్లే నన్న సంగతి ..ఈ కువిమర్మకులకు అర్థం కావాల్సి వున్నది.
అందుకే మన అధినేత సిఎం కేసఆర్ గారు చెప్పినట్టు నూతన ఆర్ధిక విధానం తక్షణావసరం. విజన్ ఫర్ నయా భారత్ పేరిట మన అధినేత దార్శనికతతో మనం ముందుకు పోతున్నం.
• ఇప్పడు దేశానికి కావాల్సింది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు…డబుల్ ఇంపాక్ట్ సర్కార్..
…………………….
బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కె.కేశవరావు గారి ప్రసంగం – ముఖ్యాంశాలు
• బిఆర్ఎస్ కు బలం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కార్యకర్తలే
• గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అఖండ విజయంలో కార్యకర్తలు గొప్ప పాత్ర పోషించారు.
• బిఆర్ఎస్ జెండా నాయకుల, కార్యకర్తలు కలిసి పనిచేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవాలి.
• ‘నేషనల్ మిషన్’ తో ముందుకు సాగాలి
• స్టేట్ లీడర్స్ పరస్పర సమన్వయంతో పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవాలి.
• నాయకులు తమ లోపాలను అధిగమిస్తూ ఎప్పటికప్పుడు నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలి.
• దేశానికి కేసీఆర్ విజనరీ లీడర్ షిప్ అవసరం
• నేను నెహ్రూ తో కూడా స్టూడెంట్ లీడర్ గా కలిసిన. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను చూసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్
• కేటిఆర్ హైదరాబాద్ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నారు.
• తెలంగాణ రాష్ట్రం దేశమే అబ్బురపడేలా యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణం, 125 అడుగుల అంబేద్కర్, కొత్త సెక్రటేరియట్ వంటి గొప్ప గొప్ప నిర్మాణాలను చేపట్టింది.
• నిన్నటి దాకా నదులు సముద్రంలో కలిసేవి. కానీ కేసీఆర్ పాలనలో నదులు పొలాలకు పారుతూ, ఇండ్లల్లకు మళ్ళుతూ సాగునీటి, తాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి.
• ఇతర ప్రభుత్వాలు 75 ఏండ్లలో చేయలేని పనులను 9 ఏండ్లలో చేసి చూపించగలిగాం.
• ప్రధాని మోడి దేశాన్ని అదానీకి దోచిపెడుతుంటే, సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి నిధులను మళ్ళిస్తున్నారు.
• రాష్ట్రంలోని జల వనరులను లభ్యతను, నదీ ప్రవాహాలను స్క్రీన్ పై ఇంజనీర్ లా సోదాహరణంగా వివరించిన సీఎం కేసీఆర్ గారి వంటి వ్యక్తి మరొకరు లేరు.
• వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులను తెచ్చిన ఘనత సీఎం కేసీర్ గారికే దక్కుతుంది. ప్రజారోగ్యం రంగంలో తెలంగాణ తెచ్చిన సంస్కరణలను పార్లమెంటు స్టాండింగ్ కమిటి గొప్పగా ప్రశంసించింది.
• పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టపరిచేందుకు చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలతో సీఎం కేసీఆర్ కార్యకర్తల మనసు గెలుచుకున్నారు. వాళ్ళ కష్టాలు, అవసరాలు తెలుసుకుని ముందుకు సాగుతున్న తీరుతో కార్యకర్తల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తున్నది.
• ప్రైవేటైజేషన్ కాదు నేషనలైజేషన్ కావాలన్న ప్రోగ్రెసివ్ లీడర్ సీఎం కేసీఆర్
• బిఆర్ఎస్ పార్టీ దేశ వికాసమే లక్ష్యంగా నికార్సైన ఎజెండాతో ముందుకు సాగుతున్నది.