హైదరాబాద్, ఏప్రిల్ 28 :
ఈనెల 30 వ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న డా. బిఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయం భవనంలో భద్రతా ఏర్పాట్లను డీజీపీ అంజనీ కుమార్, సీనియర్ పోలీస్ అధికారులతో కలసి నేడు పరిశీలించారు. టీ.ఎస్.ఎస్.పి అడిషనల్ డీజీ స్వాతి లక్రా, లా అండ్ ఆర్డర్ విభాగం ఏడీజీ సంజయ్ జైన్, నగర పోలీస్ కమీషనర్ సి.వీ.ఆనంద్, అడిషనల్ సీపీ సుధీర్ బాబు, టఫ్శీర్ అహ్మద్ తదితర అధికారులతో కలసి నూతన సచివాలయం ప్రాంగణంలో మొత్తం తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రారంభోత్సవం, అనంతరం నిర్వహించే సభ, వీవీఐపీ ల ప్రవేశం, పార్కింగ్ ఏర్పాట్లు, సచివాలయంలోకి సిబ్బంది, అధికారుల ప్రవేశ మార్గంలో బందోబస్తు, తదితర ఏర్పాట్లను అంజనీ కుమార్ అధికారులతో కలసి సమీక్షించారు.
Post Views: 200