‘చంద్రముఖి 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Grand Pre-Release Event Of Raghava Lawrence, Kangana Ranaut, Lyca Productions Big Budgeted Film ‘Chandramukhi 2’ On September 24th

Star Choreographer, Actor, Producer, Director, Raghava Lawrence in a lead role, Bollywood Starlet Kangana Ranaut in a titular role are playing the lead roles in the big budgeted film, ‘Chandramukhi 2’. Senior Director P. Vasu is helming this project. Subhaskaran is producing the film under prominent production house Lyca Productions. This high budgeted film is getting released in Telugu, Tamil, Hindi, Kannada, Malayalam languages on 28th September. Sri Lakshmi Movies banner is releasing ‘Chandramukhi 2’ in both Telugu states.

Recently released ‘Chandramukhi 2’ trailer has multiplied the expectations on the film. 17 years ago

సెప్టెంబర్ 24న రాఘవ లారెన్స్, కంగనా ర‌నౌత్, లైకా ప్రొడక్ష‌న్స్ భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్

స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్ 28న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యాన‌ర్‌పై రిలీజ్ చేస్తున్నారు.

వేట్ట‌య రాజాగా రాఘవ లారెన్స్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెప్పించ‌నున్నారు. వేట్ట‌య రాజాపై ప్ర‌తీకారం తీర్చుకోవ‌టానికి చంద్ర‌ముఖిగా కంగ‌నా ర‌నౌత్‌ సిద్ధ‌మైంది. అస‌లు వీరి మ‌ధ్య జ‌రిగిన అస‌లైన క‌థేంటి.. వేట్ట‌య రాజాపై చంద్ర‌ముఖి ప్ర‌తీకారం తీర్చుకుందా? ఆమె ప‌గ చ‌ల్లారిందా? అనే విష‌యాలు తెలియాంటే సెప్టెంబ‌ర్ 28 వ‌ర‌కు ఆగాల్సిందే. హార‌ర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు వ‌డివేలు త‌న‌దైన కామెడీతో మెప్పించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు.

సెప్టెంబర్ 24న ‘చంద్రముఖి 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌ జె.ఆర్.సి.కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించబోతున్నారు. లారెన్స్‌, కంగ‌నా ర‌నౌత్ స‌హా ఎంటైర్ యూనిట్ ఈవెంట్‌లో పాల్గొన‌బోతున్ఆన‌రు. ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్స్ యువీ మీడియా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్ లెవల్లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.

న‌టీన‌టులు:

రాఘ‌వ లారెన్స్‌, కంగ‌నా ర‌నౌత్‌, వ‌డివేలు, ల‌క్ష్మీ మీన‌న్‌, మ‌హిమా నంబియార్‌, రాధికా శ‌ర‌త్ కుమార్‌, విఘ్నేష్‌, ర‌విమారియ, శృష్టి డాంగే, శుభిక్ష‌, వై.జి.మ‌హేంద్ర‌న్ రావు ర‌మేష్‌, సాయి అయ్య‌ప్ప‌న్, సురేష్ మీన‌న్‌, శత్రు, టి.ఎం.కార్తీక్‌

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: పి.వాసు, బ్యాన‌ర్‌: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, నిర్మాత‌: సుభాస్క‌ర‌న్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ హెడ్‌: జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: తోట త‌ర‌ణి, మ్యూజిక్‌: ఎం.ఎం.కీర‌వాణి, ఎడిట‌ర్‌: ఆంథోని, స్టంట్స్‌: క‌మల్ క‌న్న‌న్‌, ర‌వివ‌ర్మ‌, స్టంట్ శివ‌, ఓం ప్ర‌కాష్‌, లిరిక్స్‌: యుగ భార‌తి, మ‌ద‌న్ క‌ర్కి, వివేక్, చైత‌న్య‌ప్ర‌సాద్‌, కాస్ట్యూమ్స్‌: పెరుమాల్ సెల్వం, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: నీతా లుల్లా, దొర‌తి, మేక‌ప్‌: శ‌బ‌రి గిరి, స్టిల్స్‌: జ‌య‌రామ‌న్‌, ఎఫెక్ట్స్‌: సేతు, ఆడియోగ్ర‌ఫీ: ఉద‌య్ కుమార్‌, నాక్ స్టూడియోస్‌, ప‌బ్లిసిటీ డిజైన్‌: ముత్తు, పాయింట‌ర్ స్టూడియో, పి.ఆర్‌.ఒ: యువ‌రాజ్(త‌మిళ్‌), సురేంద్ర నాయుడు – ఫ‌ణి కందుకూరి (తెలుగు), మార్కెటింగ్ – ఫస్ట్ షో, ఈవెంట్స్

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest