యుద్ధం చెయ్యాల్సింది మోడీ తో ..గల్లిలో ఉండే బిల్లా ,రంగాతో కాదు

స్వతంత్ర పోరాటంలో బీజీపీ పాత్ర ఏంటిది? బీజేపీ నేతలకు సీఎం సూటి ప్రశ్న

* దేశం కోసం గాంధీ కుటుంభం ఎన్నో త్యాగాలు చేశారు
* తెలంగాణ ఇచ్చిన గాంధీ పార్టీనీ మనం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలి
* మనం యుద్ధం చెయ్యాల్సింది మోడీ తో ..గల్లిలో ఉండే బిల్లా ,రంగాతో కాదు
* ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల లోపు మేము ఇచ్చిన హామీలు అమలు పరుస్తాం

హైదరాబాద్ , 25 జనవరి 2024:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో బీజేపీ, బి ఆర్ ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా యుద్ధం చెయ్యాల్సింది మోడీతో కానీ గాలిలో ఉండే బిల్లా , రంగాలతో కాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇచ్చిన గాంధీ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. బి ఆర్ ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చెయ్యలేదు కాబట్టే ఎన్నికల్లో ఓడించారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల లోపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చినట్టే చేసి చూపిస్తామని చెప్పారు. ఇప్పటికే రెండు హామీలను విజయవంతంగా అమలు పరుస్తున్నామని పేర్కొన్నారు. ఫిబ్రవరి లో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఎమ్మెల్యే లేదా ఎంపీ కాగానే ఆరు నెలలు గడవక ముందే మంత్రి ,కేంద్ర మంత్రి కావాలని అడిగే ఈరోజుల్లో రాహుల్ గాంధీ ఏనాడైనా ప్రధాని పదవి కావాలని ఎప్పుడైనా అడిగాడా ? అని రేవంత్ రెడ్డి అన్నారు. స్వతంత్ర పోరాటం లో బీజేపీ పాత్ర ఏంటిదో ప్రస్తుత బీజేపీ నాయకులు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హామీలను అమలు చెయ్యలేని బి ఆర్ ఎస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కులేదని అన్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతు బందు పూర్తిగా వేస్తామని చెప్పారు.
”రేవంత్ రెడ్డి నిజంగానే మేస్త్రి నే… మీరు విద్వంసం చేస్తే ఆ విధ్వంసాన్ని సరి చేసే మేస్త్రి నీ నేను.మిమ్మలని 100 మీటర్ ల లోతు లో ఘోరీ కట్టే మేస్త్రి నీ నేనే..ఈ నెలాఖరుకు ఇంద్రవెల్లి కి వస్తున్న కాసుకొండి బిడ్డలారా” అని ఆగ్రహించారు.
కెసీఆర్ నువ్వు రాజ్యసభ సభ్యులు చేసింది..కరోనా కాలంలో వేల కోట్లు దోచుకున్న పార్థ సారథి రెడ్డినీ,రవి చంద్ర
,దామోదర లను రాజ్యసభ సభ్యులను చేసావు.తెలంగాణలో కాంగ్రెస్ చిన్న చిన్న కార్యకర్తలకు టికెట్ లు ఇస్తే ఎమ్మేల్యేలు అయ్యారు.మరి నువ్వు ఎవరికి టికెట్ లు ఇచ్చావు.కాంగ్రెస్ ఒక దళితున్ని ఎఐసిసి చీఫ్ చేసింది..మరి నువ్వు ఎవర్ని చేసావు..
17 పార్లమెంట్ స్థానాల్లో నేను సభలు పెడుతాను.మొన్నటి ఎన్నికల్లో మీ పార్టీని ఒడించాము.ఈ ఎన్నికల్లో మేము గెలిచి బిల్లా రంగాలను తెలంగాణ సరిహద్దులను దాటిస్తాము.బిల్లా,రంగాలు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు.చార్లెస్ సోబరాజు ఇంట్లో దుప్పటి పట్టుకుని పడుకున్నాడు.పులి బయటికి వస్తుంది అన్నాడు కదా రమ్మని చెప్పండి బోను పట్టుకుని రెడీ గా ఉన్నాము.మోడీ కేడి రెండు ఒక్కటే.. నాణేనికి మోడీ ఒక వైపు కెసీఆర్ ఒక వైపు…ఇక్కడ గెలిచిన ఒకటో రెండో సీట్లు కూడా కెసీఆర్ మోడీకి తాకట్టు పెడతాడు. కెసీఆర్ నీ పీక పిసికే బాధ్యత మా పార్టీ తీసుకుంది.ఇందిరమ్మ కమిటీలు వేస్తాము..అందులో బూత్ లెవల్ కమిటీ సభ్యులు ఉంటారు అని రేవంత్ అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest