హైదరాబాద్ , 25 జనవరి 2024 :
పెద్దల సభకు ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదించింది. తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ ఉర్దూ దిన పత్రిక ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ లను పెద్దల సభకు పంపిస్తూ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఆమోదముద్ర వేశారు. దీంతో కోదండరాం అభిమానుల్లో , టి జె ఎస్ కార్యాలయంలో పండగ చేసుకున్నారు. సియాసత్ కార్యాలయంలో కూడా స్వీట్లు పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించిన కోదండరాం తెలంగాణ సాధించడంలో చాలా కీలకపాత్రను పోషించారు. ఆయన తెలంగాణ కోసం చేసిన కృషికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించి ఆయన్ని పెద్దల సభకు పంపించింది.
Post Views: 55