హైదరాబాద్ :
భారత రాష్ట్ర సమితి ( బి ఆర్ ఎస్ ), బహుజన సమాజ్ పార్టీ ( బి ఎస్ పీ ) రెండు పార్టీలు కలవబోతున్నాయా? రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య అంతర్గత ఒప్పందం కుదురుతోందా? ఇటీవల ఈ రెండు పార్టీలకు చెందిన అగ్ర నాయకులు అంతర్గత ఒప్పందం గురించి చర్చించుకున్నట్టు ఆయా పార్టీల అగ్ర నేతలు చర్చించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒక పార్లమెంట్ సీటు బి ఎస్ పీ కి ఇచ్చేటట్టు , బి ఎస్ పీ మాత్రం అన్ని చోట్ల బి ఆర్ ఎస్ కు మద్దత్తు తెలిపేటట్టు మాట్లాడుకున్నారని ఒక పార్టీకి చెందిన నాయకులు చర్చించుకుంటున్నారు. బి ఎస్ పీ పార్టీ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఇప్పుడు ఆయన పార్లమెంట్ ఎన్నికలపై ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే బి ఎస్ పీ ఇండివిజువల్స్ గా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నందున బి ఆర్ ఎస్ లాంటి పార్టీతో అంతర్గత ఒప్పందం చేసుకోవడం వల్ల ప్రవీణ్ కుమార్ గెలిచేందుకు అవకాశం ఉంటుందని ఆ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పై కూడా కన్నేసినట్టు తెలుస్తోంది. ప్రవీణ్ కుమార్ కనుక పెద్దపల్లిలో పోటీ చేస్తే ఇక్కడ కూడా సిర్పూర్ లో ప్రచారం చేసినట్టు నాన్ లోకల్ క్యాండిడేట్ గా ప్రవీణ్ పై ముద్ర వేసే అవకాశాలు లేకపోలేదు. ఇక్కడ అధికశాతం ఓటర్లు నేతకాని సామజిక వర్గం వాళ్ళు ఉన్నందున మాదిగ సామజిక వర్గానికి చెందిన ప్రవీణ్ గెలుపు అంత ఈజీ కాదనేది ఇక్కడి నేతల అభిప్రాయం. మరి నిజంగానే బి ఆర్ ఎస్ , బి ఎస్ పీ రెండు పార్టీలు అంతర్గత ఒప్పందానికి వస్తే ప్రవీణ్ కుమార్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు? అనేది బి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఏ సీటును కేటాయిస్తుంది అనేది ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు.