జీవో 317పై కేబినెట్‌ సబ్‌ కమిటీ ఛైర్మన్‌గా రాజనర్సింహ

 

హైదరాబాద్‌ :

రాష్ట్రంలో కొత్తజోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో 317పై ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అభ్యంతరాల దృష్ట్యా ఈ జీవోపై మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్‌ సబ్‌కమిటీ ఛైర్మన్‌గా మంత్రి దామోదర రాజనర్సింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ ఉన్నారు. 2021లో ఇచ్చిన 317 జీవోపై వివాదాలు, ఉద్యోగుల అభ్యంతరాలపై కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest