TS Inter Hall Tickets | వెబ్‌సైట్‌లో ఇంటర్ హాల్ టికెట్లు.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే
TS Inter Hall Tickets | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఇప్పటికే హాల్ టికెట్లను కాలేజీ లాగిన్ ఐడీలో పొందుపరిచగా..
తాజాగా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. విద్యార్థులు www.tsbie.cgg.gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించి తమ తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు పదో తరగతి లేదా ఇంటర్ ఫస్టియర్ హాల్ టికెట్ నంబర్‌తో థియరీ పరీక్షల హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇక సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్టియర్ లేదా రెండో ఏడాది హాల్ టికెట్ నంబర్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు
హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత విద్యార్థులు అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని శృతి ఓజా సూచించారు. ఏవైనా పొరపాట్లుంటే వెంటనే డీఐఈవోలను సంప్రదించి సరిదిద్దుకోవాలన్నారు. ఇక ఈ హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా ఫర్వాలేదని.. ఆయా విద్యార్థులను పరీక్షకు అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు