సముద్ర గర్భంలో ప్రధాని మోదీ పూజలు

గుజరాత్ :

గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సముద్రంలో మునిగి పోయిన ద్వారకా నగరానికి వెళ్లి పూజలు చేశారు.
ఇండియన్ నేవీ సహాయంతో ఆక్సిజన్ సిలిండర్లు ధరించి సముద్రంలో అట్టడుగుకు చేరుకుని శ్రీకృష్ణుడికి ప్రార్థనలు చేసిన వీడియోను పీఎంఓ ట్విటర్లో షేర్ చేసింది. ప్రార్థనా స్థలంలో ప్రధాని మోదీ ధ్యానం చేస్తూ నెమలి ఈకలను ఉంచి నమస్కరించారు. ఈ చర్యతో ద్వారకా టూరిజం మరింత పెరుగుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest