మనం తెరకెక్కించే సినిమాలో వాణిజ్య అంశాలతో పాటు సామాజిక ప్రయోజనం కూడా వుండాలని నమ్మే దర్శకుల్లో ఎన్.శంకర్ అగ్రగణ్యుడు. ఎన్కౌంటర్, శ్రీరాములయ్య, జయం మనదేరా, ఆయుధం, భద్రాచలం, జై భోలో తెలంగాణ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు ఎన్.శంకర్. ఆయన ప్రతి సినిమా ఇప్పటికీ ప్రతి తెలుగువాడి మనసులో చెరగని ముద్ర వేసుకుంది. అయితే తాజాగా ఆయన పలు వెబ్‌సీరీస్ లను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. “ ఎన్.శంకర్ టీవీ అండ్ ఫిల్మ్ స్టూడియో”బ్యానర్లో ఆయన నిర్మాతగా , ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో చారిత్రాత్మక కధాంశాలతో రూపొందనున్న ..
మూడు వెబ్‌సీరీస్‌ల విశేషాలు గురించి ఎన్.శంకర్ తెలియజేశారు.
తెలంగాణ సాయిధ పోరాటం నుండి,
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు..
మొదటి వెబ్ సిరీస్…
తెలంగాణ సాయిధ పోరాటంలో ప్రజలే, సైనికులుగా
యుద్ధం చేయాల్సి వచ్చిన పరిస్థితులు, భూస్వామ్య వ్యవస్థ లో సామాన్యుల మీద జరిగిన దాడులు.. ప్రజలు,ముఖ్యంగా మహిళల ప్రతిఘటన మొదలుకుని, తెలంగాణ ప్రాంతం ఇండియన్ యూనియన్ లో కలపబడటం..ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడటం..ఆ తరువాత జరిగిన పరిణామాలు, పాలకుల నిర్ణయాలు..రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానతలు, ప్రజల తరఫున ఉద్యమాలు, విప్లవపార్టీల భావజాలం తో పాటు, ప్రజాస్వామ్య బద్దంగా జరిగిన పోరాటాల కొనసాగింపు గ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, జరిగిన పోరాట నేపథ్యం..తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు, తెలంగాణ సమాజం లో , ఉద్యమాల్లో జరిగిన ఆటుపోట్లు, కవులు కళాకారులు మేధావులు పంచిన చైతన్యం, విద్యార్థుల, యువకుల త్యాగాలు, ప్రజల భాగస్వామ్యం, నిష్పక్షపాతంగా,ప్రజల కోణం లో అర్థవంతంగా,చూపించాలనే సంకల్పంతో ఈ వెబ్‌సీరీస్ కు శ్రీకారం చుడుతున్నాం. అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలవుతుంది..
మహాత్మ జ్యోతీరావు పూలే స్ఫూర్తితో…
రెండవ వెబ్‌సీరీస్
మహాత్మ జ్యోతీరావు పూలే అనుభవాలు, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, సంఘర్షణలు (ఆయన బయోగ్రఫీ కాదు) పేదలకు, మహిళలకు విద్యను భోదించటం కోసం, తన సతీమణి సావిత్రిబాయి గారి ద్వారా తన సంకల్పానికి శ్రీకారం చుట్టి, ఆనాటి దురాచారాల పట్ల తిరుగుబాటు చేసిన క్రమం లో ,ఆయన ఎదుర్కొన సమస్యలు, అవమానాలు, త్యాగాలు, ఆయన జ్క్షానం, ఆయన చేసిన భోదన కథాంశంగా రెండవ వెబ్ సిరీస్
మూడోది బాబా సాహెబ్ అంబేద్కర్ (బయోగ్రఫీ కాదు) గారు, ఆయన ఈ దేశానికి , అట్టడుగు ప్రజలకు, అణగారిన వర్గాలకు ఇచ్చిన గొప్ప రాజ్యాంగ స్ఫూర్తిని , ఆయన వ్యక్తిగత జీవితంలో అనుభవించిన బాధలను, తన ధృడ సంకల్పం, వ్యక్తి నుండి వ్యవస్థగా తను మారడానికి మద్య జరిగిని సంఘర్షణలు ఇతి వృత్తంగా
మూడో వెబ్ సిరీస్ వర్క్ జరుగుతుంది..
మహాత్మ జ్యోతిరావు పూలేతో పాటు డా.బాబాసాహెబ్అంబేద్కర్‌ల వెబ్‌సీరీస్ లు వారి బయోగ్రఫీలు కాదు. వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు, ప్రజల పట్ల వాళ్ల కున్న కమిట్మెంట్, సమాజంలో సమానతల కోసం వారు చేసిన నిజాయితీ పోరాటం, వారి నిజ జీవితంలో జరిగిన సంఘర్షణలు, వారు పొందిన అవమానాలు, గౌరవాలు, ఇలా అన్ని ఈ తరం వారికి తెలియజెప్పాలనే లక్ష్యంతో ఈ వెబ్‌సీరీస్ లు చేస్తున్నాం.
ఈ మూడు వెబ్‌సీరీస్‌లను కూడా పూర్తి ఆసక్తికరంగా వుండే విధంగా హిందీ, తెలుగు భాషల్లో నిర్మిస్తాం. మూడు సంవత్సరాల నుండి మా టీమ్‌తో కలిసి ఈ కథలపై వర్క్ చేస్తున్నాం. పూర్తి వివరాలతో, త్వరలో
మీ ముందుకు వస్తాం
Post Views: 128