హైదరాబాద్ :
వంశీచంద్ రెడ్డి… ఈపేరు ఒక సంచలనం. 2014 ఎన్నికల్లోనే సంచలనం సృష్టించిన వంశీచంద్ రెడీ ఏకంగా రాహుల్ గాంధీ అతి సన్నిహితుడిగా పేరు పొందాడు. కాంగ్రెస్ పార్టీ, ఏ ఐ సి సి కార్యక్రమంలో ఎంతో చురుకుగా వ్యవహరించిన వంశీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో జరిగిన ఆందోళనలో రాహుల్ గాంధీ ఆఘమేఘాల మీద యూనిర్సిటీకి రావడానికి కారణం వంశీచంద్ . అందుకే రాహుల్ గాంధీకి వంశీ చంద్ అంటే చాలా ఇష్టం. నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే వంశీచంద్ మహబూబ్ నగర్ పార్లమెంట్ కు పోటీ చేస్తారని ముఖ్యమంత్రి , టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల బహిరంగ సభలో ప్రకటించారు. వంశీ కూడా మహబూబ్ నగర్ జిల్లాకు నీటి వాటా విషయంలో జరుగుతున్న అన్యాయం పై పాదయాత్ర చేపట్టాడు. అంతేకాదు ఆ జిల్లాకే చెందిన బీజేపీ నేత డీకే అరుణతో ఒక విధంగా యుద్ధమే చేశాడని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏ ఐ సి సి మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును ప్రకటించింది. ఇప్పుడు ఆ జిల్లాలో వంశీకి ఎదురెవరు నిలబడతారు అనే ప్రశ్న మొదలైంది. బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. బి ఆర్ ఎస్ నుంచి కూడా ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ప్రచారంలో కూడా దూసుకుపోతున్న వంశీచంద్ రెడ్డి పేరు కాంగ్రెస్ పార్టీ ఖరారు చెయ్యడంతో వంశీ కాంపౌండ్ లో సంబురాలు మొదలైయ్యాయి. వంశీ గెలుపు ఖాయమనే నినాదం ఇప్పటి నుంచే వినిపిస్తోంది. బీజేపీ, బి ఆర్ ఎస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని పని చేసిన వంశీ గెలుపుకు అడ్డు ఉండదని ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన అభ్యర్థి కావడం, ముఖ్యమంత్రికి అతి సన్నిహితంగా ఉండే వ్యక్తి కావడంతో వంశీచంద్ రెడ్డిని గెలిపించుకునే బాధ్యత కూడా ముఖ్యమంత్రిపై ఉంటుంది. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి గెలుపు ఖాయమని తెలుస్తోంది.