ఎస్తర్ ఏం ‘మాయ’ చేస్తుందో?

 

వెయ్యి అబద్దాలు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఎస్తర్ నూరోన్హా . కమెడియన్ సునీల్ కు జోడిగా ఓ సినిమా చేసి హిట్ కొట్టిన ఎస్తర్ ఈ మధ్య కాలంలో మళ్ళీ తెలుగు తెరపై తెగ కనిపిస్తోంది. ఫుల్ లెన్త్ సినిమాలతో పాటు గెస్ట్ రోల్స్ కూడా చేస్తున్న ఎస్తర్ తాజా సినిమా ‘మాయ’ రిలీజ్ కు రెడీ అయింది. ఈ నెల 15న మాయ సినిమా విడుదల అవుతోంది. అయితే అందరు హీరోయిన్ లాగా కాకుండా తాను నటించిన ప్రతి సినిమా ప్రమోషన్ కు వస్తోంది ఎస్తర్. అది చిన్న సినిమా అయినా, గెస్ట్ రోల్ అయినా ఖచ్చితంగా ప్రమోషన్ లో మాత్రం పాల్గొంటోంది. ఇది హీరోయిన్ లకు ఉండాల్సిన మంచి యాటిట్యూడ్ అని అంటోంది సినిమా ఇండస్ట్రీ.ఇటీవల మాయ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ కు వచ్చింది ఎస్తర్.


మాయ అనే సినిమాలో ఇంతవరకు తాను చెయ్యని పాత్ర చేస్తున్నాను. ప్రేక్షకులకు కొత్తగా కనిపిస్తాను అంటోంది. ఈ నెల 15న విడుదల అవుతున్న ఈ సినిమాను అందరు చూసి ఆదరించాలని కోరుకుంటోంది. తాను మెయిన్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాకు రమేష్ నాని దర్శకుడు. రాజేష్ నిర్మాత. ఒక సినిమా షూటింగ్ లో లంచ్ టైం లో వచ్చి రమేష్ నాని కథ చెప్పాడు. కథ నచ్చింది. వెంటనే ఒకే చెప్పేశా అంటోంది ఎస్తర్. ఏది ఒక వెరైటీ కథ . ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. అని ఎస్తర్ చెప్పింది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ. కానీ ఇందులో ఎమోషన్స్ కూడా చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో చాలా మంది కొత్తవాళ్లు పని చేసినా , వీళ్లందరితో కలిసి పని చెయ్యడం హ్యాపీగా ఉందని ఎస్తర్ చెప్తోంది. డెవిల్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ ఈ సినిమాలో కీలకమైన రోల్ చేశానని అన్నారు. రాష్ట్రి, పగలు అని తేడా లేకుండా సినిమాలు చేస్తున్నాను. వచ్చిన ప్రతి పాత్రకు న్యాయం చెయ్యడానికి ప్రయత్నిస్తాను. సమయం దొరికినప్పుడు మాయ సినిమా పబ్లిసిటీ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నాను. అని చెప్తోంది ఎస్తర్.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest