నేస్తం ఫౌండేషన్, తెలుగు సినిమా వేదిక, డిజిక్వేస్ట్ అకాడమీ అధ్వర్యంలో జె.వి.మోహన్ గౌడ్, పి.విజయ వర్మ, పి. యల్ .కే. రెడ్డి నిర్వహణలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక ఘనంగా ముగిసింది.. అతిథులుగా పాల్గొన్న తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు కె. యల్.దామోదర ప్రసాద్, డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీర శంకర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ అనుపమ్ రెడ్డి, ఛాంబర్ మరియు కౌన్సిల్ EC మెంబర్ నాగులపల్లి పద్మిని, రైటర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర గోపాల, నటుడు నిర్మాత కె.సురేష్ బాబు లు మహిళల గొప్పతనాన్ని గురించి కొనియాడి, ఇలాంటి కార్యక్రమాలు జరగడం తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వ కారణమని తెలిపి సన్మాన గ్రహీతలకు సన్మానం చేశారు.. సన్మాన గ్రహితలలో సినీ అండ్ టివి ఆర్టిస్ట్స్ అనితా చౌదరి, ఇందు ఆనంద్, కీర్తి భట్, హై కోర్ట్ న్యాయవాది కుల్లపరెడ్డి శ్వేత, ఉమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ కోచ్ లక్ష్మి సామ్రాజ్యం, జర్నలిస్ట్ దేవినేని గంగా భవాని, సెన్సార్ బోర్డ్ మెంబర్ దేశబత్తుల సుధా రవి,నిమ్స్ ఆసుపత్రి ఐసీయూ వార్డు నర్స్ సుశీల కుమారి ఉన్నారు..