19న మనుకోటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

 

🔹బలరాం నాయక్  మీద ముఖ్యమంత్రి కి ప్రేమ ఎక్కువ,అందుకే మొదటి నామినేషన్,భారీ బహిరంగ సభకు వస్తున్నారు – వేం నరేందర్ రెడ్డి

మహబూబాబాద్:

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్  ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి  ప్రధాన సలహాదారులువేం నరేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

అనంతరం నరేందర్ రెడ్డి  మాట్లాడుతూ ఏప్రిల్ 19న మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి  పోరిక బలరాం నాయక్  నామినేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం నాలుగు గంటలకు మహబూబాబాద్ జన జాతర ఎన్టీఆర్ స్టేడియం లో జరిగే భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా రానున్న సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఎన్టీఆర్ స్టేడియం సభ స్థలం పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చంద్ రెడ్డి , డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రాంచంద్ర నాయక్ , టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి , డాక్టర్ పులి అనిల్ కుమార్ , మహబూబాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఘనపురపు అంజయ్య  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తదితరులు ఉన్నారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest