సమస్యలు మంత్రి దృష్టికి తీసుకొచ్చిన వాకార్స్

కరీంనగర్:

కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ , చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ . వాకర్స్ తో ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు,ఎమ్మేల్యేలు.పట్టణంలోని పలు సమస్యలు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిన వాకార్స్.

మంత్రి పొన్నం ప్రభాకర్

ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కాలేజ్ వాకర్స్ ని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాం.నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 2009-2014 మధ్య వాకర్స్ కి వేసిన ట్రాక్, తదుపరి ఓపెన్ జిమ్ తప్ప తరువాత జరిగింది ఎం లేదు.వారు వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు.ఉమెన్ టాయిలెట్స్ లేవు మల్లి ట్రాక్ వేయాల్సి ఉంది.దాంతో పాటు ఓపెన్ జిమ్ ని ఇంకా చేయాల్సి ఉంది.వార్మప్ కు కూడా ఒక ప్లాట్ ఫారం కావాలని అడిగారు.వారివి న్యాయమైన డిమాండ్స్.ఉదయం పూట ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వాకింగ్ చేస్తున్నారు.దేశంలో ప్రజాస్వామ్యం ఇబ్బంధుల్లో ఉంది.అంబేద్కర్ జయంతి జరుపుకున్నాం.. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరూ ఆలోచన చేయాలి.వాకర్స్ కి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్న.వారంతో సానుకూలమైన ఆలోచనతో వస్తారని ఆకాంక్షిస్తున్న.రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడో… మొహబ్బత్ జోడో అని ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అనేక రకాలుగా వ్యవహారిస్తున్నారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మనకు మాట్లాడే హక్కు ఉంటుంది.దేశంలో ఉపాధి అవకాశాలు నిరుద్యోగ సమస్య పెరుగుతున్న సందర్భంలో వాటన్నిటిని అధిగమించడానికి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండాలి.నేను NSUI అధ్యక్షుడిగా ఉన్నప్పటినుండి SRR కాలేజీ మంచి చెడులు చూసుకుంటున్న.ఇక్కడున్నవారికి వారు అడిగిన సౌకర్యాలు కల్పిస్తాం.దేశాన్ని కాపాడడానికి మీరు ఆలోచన చేయాలి.దేహం తో పాటు దేశాన్ని కాపాడాలి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest