లవ్ లీ యంగ్ హీరో ఆది సాయి కుమార్ మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చుట్టలబ్బాయ్ అంటూ దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో మంచి చిత్రాన్ని చేసిన ఆది సాయి కుమార్ మళ్లీ విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో సినిమాను చేస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం నాడు కాకతీయ హిల్స్‌లోని వెంకటేశ్వరుడి సన్నిధిలో ఘనంగా జరిగాయి. పూజా కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు షాట్‌కు దిల్ రాజు గారు క్లాప్ కొట్టగా.. అనిల్ రావిపూడి గారు దర్శకత్వం వహించారు. ఇక స్క్రిప్ట్ అందజేస్తూ కెమెరాను సాయి కుమార్ గారు స్విచ్ ఆన్ చేశారు.
*చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ..* ‘మా మూవీ ఓపెనింగ్‌కు వచ్చిన దిల్ రాజు గారికి, అనిల్ రావిపూడి గారికి థాంక్స్. చుట్టలబ్బాయ్ తరువాత మళ్లీ ఓ సినిమా చేయాలని నేను, వీరభద్రమ్ గారు ప్రయత్నించాం. ఇన్ని రోజులకు మంచి కథ, స్క్రిప్ట్ దొరికింది. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా అవుతుంది. కుటుంబమంతా కలిసి చూసి నవ్వుకునేలా ఉంటుంది. జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. క్రేజీ ఫెల్లో సినిమాలో నేను, దిగంగనా సూర్యవంశీ కలిసి నటించాం. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంలో నటిస్తున్నాం. ప్రేమ కావాలి, లవ్ లీ, సుకుమారుడు, ప్యార్ మే పడిపోయానే అంటూ అనూప్ రూబెన్స్ నాకు మంచి సాంగ్స్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మంచి పాటలు ఇస్తున్నారు. ఈ రోజు అనూప్ గారి పుట్టిన రోజు. మంచి టెక్నీషియన్లు, ఆర్టిస్టులతో రాబోతున్నాం. అన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామ’ని అన్నారు.
*దర్శకుడు వీరభద్రమ్ చౌదరి మాట్లాడుతూ..* ‘మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి గార్లకు థాంక్స్. చుట్టలబ్బాయ్ తరువాత సినిమా చేయాలని నేను, ఆది చాలా కథలు విన్నాం. ఇప్పటికి మాకు టైం, లక్ కలిసి వచ్చింది. మంచి కథ దొరికింది. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. ఆది సరసన దిగంగనా సూర్యవంశీ నటిస్తున్నారు. హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మా సినిమాను నిర్మాతలు తూము నరసింహా, జామి శ్రీనివాసరావు ఖర్చుకి ఏ మాత్రం వెనుకాడకుండా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, రామ్ డైలాగ్స్, శ్యాం విజువల్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. మాకు అండగా నిలిచిన మీడియాకు థాంక్స్’ అని అన్నారు.
*సాయి కుమార్ మాట్లాడుతూ..* ‘దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి గారు ఎంత బిజీగా ఉన్నా అడిగిన వెంటనే వచ్చినందుకు థాంక్స్. వీరభద్రమ్ గారికి ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. మేం చేసిన చుట్టలబ్బాయ్ బాగా ఆడింది. ఆయన కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను తీస్తుంటారు. కృష్ణ ఫ్రమ్ బృందావనం కూడా ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రంగా ఉంటుంది. ఆదికి అనూప్ రూబెన్స్ ఎప్పుడూ కూడా బెస్ట్ ఆల్బమ్స్ ఇస్తూనే వచ్చారు. ఈ సినిమాలోనూ మంచి పాటలు ఉండబోతున్నాయి. ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాతలు మంచి కథతో చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*దిగంగనా సూర్యవంశీ మాట్లాడుతూ..* ‘ఆది గారితో ఇది వరకు నేను క్రేజీ ఫెల్లో సినిమా చేశాను. మళ్లీ ఆది గారితో కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉంది. వీరభద్రమ్ గారు చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. ఇందులో నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
నటీనటులు : ఆది సాయికుమార్, దిగంగనా సూర్యవంశీ, మురళీధర్ గౌడ్, 30 ఇయర్స్ పృధ్వీ, రఘు బాబు, అవినాష్, రచ్చ రవి, అశ్విని, శ్రీ దేవి, అలేక్య, స్నేహ, పద్మ, గిరిధర్, గోవర్ధన్, మాస్టర్ రిత్విక్, వెంకట్ నారాయణ, గురు రాజ్ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్
నిర్మాత: తూము నరసింహ, జామి శ్రీనివాస్
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్ చౌదరి
డీఓపీ. : శ్యామ్
సంగీతం. : అనూప్ రూబెన్స్
ఎడిటర్. : చోటా కె ప్రసాద్
డైలాగ్స్ : రాము మన్నార్
ఫైట్స్. : డ్రాగన్ ప్రకాష్, శంకర్
పీఆర్వో : సాయి సతీష్
*Dil Raju, Anil Ravipudi Graced the launch of Aadi Sai Kumar’s new film ‘Krishna From Brindavanam’*
Lovely Young Hero Aadi Sai Kumar is coming up with another wholesome family entertainer. The young hero who previously did an out-and-out entertainer Chuttalabbai with director Veerabhadram Chowdary collaborated with him again for the new movie infused with elements like village drama, family, love, comedy, and feel-good emotions. This movie is jointly produced by Thumu Narasimha and Jami Srinivasa Rao under Lakshmi Prasanna Productions banner. The title of the film was finalized as ‘Krishna From Brindavanam’.
The film’s launching event was held grandly in Venkateswara Temple in Kakatiya Hills on Thursday. Successful producer Dil Raju, and blockbuster director Anil Ravipudi, distinguished actor and dialogue king Sai Kumar were the chief guests for the pooja event. For the muhurtham shot, Dil Raju sounded the clapboard, while Anil Ravipudi did the honorary direction. Sai Kumar who handed over the script to the makers also switched on the camera.
*During the opening ceremony of the film, hero Aadi Sai Kumar said,* “Thanks to Dil Raju and Anil Ravipudi who came to the opening of our movie. Veerabhadram and I tried to do a film together again after Chuttalabbai. A good story and script were found after so many days. It will be a complete entertainer. The whole family can watch and enjoy together. We are going to start shooting in June. Digangana Suryavanshi and I acted together in the movie Crazy Fellow. We are acting together in this film. Anup Rubens provided me with many super hit albums such as Prema Kavali, Lovely, Sukumarudu, and Pyaar Mein Padipoyane. For this movie also he will give another great album. Today is Anup’s birthday. We are coming with good technicians and artists. All the details will be revealed soon.”
*Director Veerabhadram Chowdary said,* “Thanks to Dil Raju and Anil Ravipudi for coming to the launching event of our film. Aadi and I have heard many stories to do a film together, after Chuttalabbai. Finally, time and luck have come together for us. We’ve found a very good story. It will be fun throughout. Digangana Suryavanshi is acting opposite Aadi. The role of the heroine is very important. Producers Thumu Narasimha and Jami Srinivasa Rao have come forward to produce our film. Chota K Prasad’s editing, Ram’s dialogues, and Shyam’s visuals will be the highlights of this movie. Thanks to the media for supporting us.”
*Actor Sai Kumar said,* “Thank you Dil Raju and Anil Ravipudi for gracing the occasion, though they are busy with their respective works. Veerabhadram loves entertainment. The film Chuttalabbai had done well. He makes films that will appeal to the family audiences. ‘Krishna From Brindavanam’ is also a must-watch movie with family. Anup Rubens has always given the best albums to Aadi. This movie is also going to have good songs. I hope this film, which is being made by producers with a lot of passion and a good story, will be a big success.”
*Digangana Suryavanshi said,* “Earlier, I have done the movie Crazy Fellow with Aadi. Glad to be acting with Aadi again. I liked the story told by Veerabhadram very much. My role will be very important in this one. Thanks to the producers for giving me the chance.”
Cast: Aadi Saikumar, Digangana Suryavanshi, Muralidhar Goud, 30 Years Pridhvi, Raghu Babu, Avinash, Rachcha Ravi, Ashwini, Sri Devi, Alekhya, Sneha, Padma, Giridhar, Govardhan, Master Rithvik, Venkat Narayana, Guru Raj and others.
Technical Crew:
Banner: Lakshmi Prasanna Productions
Producers: Thumu Narasimha, Jami Srinivas
Story, Screenplay, Direction: Veerabhadram Chowdary
DOP: Shyam
Music: Anup Rubens
Editor: Chota K Prasad
Dialogues: Ramu Mannar
Fights: Dragon Prakash, Shankar
PRO: Sai Satish
Post Views: 63