అమరావతి :
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేల తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు పార్టీలు కలిసి కూటమిగా జత కట్టాయి. అయితే ఉమ్మడి మేనిఫెస్టో ను విడుదల చేసినప్పటికీ అందులో బీజేపీకి సంబంధించిన ఫోటోలు ఎవరివి లేకపోవడంపై ఏపీ బీజీపీ గుర్రుమంటోంది. మేనిఫెస్టో కవర్ పేజీపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. బీజేపీ కమలం గుర్తు ఒకటి చిన్నగా కనిపించి కనిపించినట్టు పెట్టారు. ఉమ్మడి మేనిఫెస్టో అన్నప్పుడు మోడీ ఫోటో లేదా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఫోటో గాని ఉండాలి కదా అని ఆంధ్ర బీజేపీ నేతలు మండి పడుతున్నారు.
Post Views: 69