తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన దర్శకులు, నిర్మాతలు తీస్తోన్న చిత్రాలు విజయాన్ని సాధిస్తున్నాయి. కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్ట్ మేకర్స్ సమర్పణలో మద్దుల మదన్ కుమార్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సౌజన్య కావూరి నిర్మిస్తున్న ఈ మొదటి ప్రాజెక్ట్ ప్రొడక్షన్ నెం.1కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలె మణికొండలోని శివాలయంలో జరిగాయి.
ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ గారు, విరాజ్ అశ్విన్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో పురాణపండ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. ‘సినీ రంగంలోకి వస్తోన్న కొత్త తరంలో కూడా ఎందరో ప్రతిభా సామర్ధ్యాలతో అద్భుతాల్ని ఆవిష్కరిస్తున్నారని, ఏ విత్తనంలో ఎంతటి అద్భుత మహా వృక్షం దాగుందో తెలియకుండా విశ్లేషించకూడద’ని అన్నారు.
ముహూర్తపు సన్నివేశానికి హీరో రవితేజ మహాదాస్యంపై ‘బేబీ’ ఫేమ్ విరాజ్ అశ్విన్ క్లాప్ కొట్టగా, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రానికి దియా, సంజీవ్ కోనేరు, వెంకట్ రమణారెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫర్‌గా నితిన్ రెడ్డి చిమ్ముల , ఎడిటర్‌గా అఖిల్ దేశ్‌పాండే పని చేస్తున్నారు.
సాంకేతిక బృందం
కెమెరామెన్ : నితిన్ రెడ్డి చిమ్ముల
ఎడిటింగ్ : అఖిల్ దేశ్‌పాండే
సహా నిర్మాతలు : దియా, సంజీవ్ కోనేరు, వెంకట్ రమణారెడ్డి
సంభాషణలు, పాటలు : జక్క రాజశేఖర్ రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్ : మక్కెన విజయ్
పీఆర్వో : సాయి సతీష్ (SR PROMOTIONS)
*Puranapanda Srinivas Extended Best Wishes To The Team Of Production No.1 Of Art Makers, During Its Opening Ceremony*
If the content appeals to the audience, they don’t really think about the actors present in the movie. We have witnessed many small-time movies with newcomers turning out to be hits. The makers of a new movie, that was launched on Monday, are hopeful of their movie to captivate the audience.
Budding actor Ravi Teja Mahadasyam plays the lead in the movie to be directed by debutant Maddula Madan Kumar, produced by Sowjanya Kavuri as Production No.1, and presented by the new production company Art Makers, had its opening ceremony at the Manikonda Lord Shiva Temple on Monday.
For the Muhurtham shot on hero Ravi Teja Mahadasyam, Baby fame Viraj Ashwin sounded the clap board, while famous writer and Srisailam Devasthanam Special Adviser Puranapanda Srinivas switched on the camera.
Nithin Reddy Chimmula is the Director of Photography, while editing is by Akhil Deshpande. Dia, Sanjeev Koneru, and Venkat Ramana Reddy are the co-producers. Rajashekar Reddy Jakka penned the dialogues and lyrics, while Makkena Vijay is the Art Director. Tejaswini is the Designer.
While speaking at the event, Puranapanda Srinivas extended his best wishes to the team. He said, “Many aspirants of new generation are coming to the film industry with bigger dreams. Various talented people are creating wonders with innovative ideas. It’s difficult to analyze one’s talent.”
Post Views: 112