వారణాసి :
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం (14-మే-2024)నాడు నామినేషన్ దాఖలు చేశారు. వారణాసి నుంచి మూడోసారి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ మేరకు నామినేషన్స్ చివరిరోజు మోడీ తన నామినేషన్ పాత్రలను దాఖలు చేశారు. మోడీ వెంట ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. జేపీ నడ్డా , అమిత్ షా లతో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. గంగ సప్తమి పుష్య నక్షత్రం కలిసిన శుభ ముహూర్తంలో మోడీ నామినేషన్ పాత్రలను దాఖలు చేశారు. 2 లక్షల 67 వేల 750 రూపాయలు విలువ చేసే చరాస్తులు తన వద్ద ఉన్నాయని చెప్పారు. సొంత ఇల్లు, సొంత కారు ఏమి లేదని నామినేషన్స్ పాత్రల్లో పేర్కొన్నారు. మోడీ పేరును నాలుగురు ప్రతిపాదించారు. అందులో ఇద్దరు ఓబీసీలు కాగా, ఒకరు బ్రాహ్మణుడు, ఇంకొకరు దళితుడు ఉన్నారు. పండిత్ గణేశ్వర్ శర్మ జ్యోతిష్యుడు. అయోధ్యలో బలరాముడు విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం పెట్టింది ఈయనే. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త బైజనాథ్ పటేల్, (ఓబీసీ), లాలచంద్ కుశ్వాహ్ (ఓబీసీ), సంజయ్ సొంకర్ (దళితుడు) వారణాసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఈ నలుగురు మోడీ పేరును ప్రతిపాదించారు. జూన్ 1వ తేదీన ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. జాన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి.