తెలంగాణ లో సింగిల్ సినిమా థియేటర్లు పది రోజుల పాటు బంద్ పెట్టనున్నారు. గత వారం రోజులుగా పెద్ద సినిమాలేవీ విడుదల కాకపోవడం, కేవలం చిన్న సినిమాలు మాత్రమే విడుదల అవుతున్నాయి. దీంతో సింగిల్ థియేటర్స్ లో ఆక్యుపెన్సీ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో వచ్చే శుక్రవారం నుంచి పది రోజుల పాటు థియేటర్లను తాత్కాలికంగా మూసి వెయ్యాలని థియేటర్ల యజమానులు నిర్ణయించారు. పది రోజుల పాటు షోలు వేయొద్దని థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. పట్టణాల్లో కన్నా మండల స్థాయిలో ఉన్న థియేటర్లలో చిన్న సినిమాలకు ప్రేక్షకులు రావడం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో పది రోజుల పాటు సినిమాలు వేయొద్దని నిర్ణయం తీసుకున్నారు.
Post Views: 51