హైదరాబాద్,
హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. మరో అయిదు రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖా పేర్కొంది. హైదరాబాద్ లోని అమీర్పేట్, యుసుఫ్ గూడ, బోరబండ, ఎస్ ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, లింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, నార్సింగి, మెహిదీపట్నం, లంగర్ హౌస్, నానక్ రామ్ గూడ, ఎల్ బీ నగర్, దిల్ షుక్ నగర్, సరూర్ నగర్, హిమాయత్ నగర్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, సికింద్రాబాద్ వంటి అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫి జామ్ అయింది. ఐదురోజుల పాటు ఈ వర్షం కురియనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీ హెచ్ ఎం సి తెలిపింది.
Post Views: 65