షిరిడి సాయిబాబాకు చంద్రబాబు పూజలు-Chandrababu pray to Shiridisaibaba

షిరిడి : మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబాను తెలుగుదేశం అధినేత , ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన భార్య భువనేశ్వరితో కలిసి పూజలు నిర్వహించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.  ఈ సందర్బంగా ఆలయ నిర్వాహకులు చంద్రబాబు దంపతులను సాదరంగా ఆహ్వానించారు. బాబు దంపతులను ఘనంగా సన్మానించారు.   షిర్డీలో తెలుగువారు నిర్వహిస్తున్న ఓ ఆశ్రమాన్నీ కూడా చంద్రబాబు దంపతులు సందర్శించారు.అనంతరం మహారాష్ట్రలోని కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని బాబు దంపతులు దర్శించుకున్నారు.

షిర్డీలో తెలుగువారు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి సందర్శించారు. సాయిబాబా దర్శనానికి గురువారం మహారాష్ట్ర వెళ్లిన చంద్రబాబు దంపతులు ఆ ఆశ్రమాన్ని సందర్శించారు. ద్వారకామయి పేరుతో నిర్వహిస్తున్న ఈ వృద్ధాశ్రమానికి తెలుగు వారైన బండ్లమూడి రామ్మోహన్ ఛైర్మన్ గా, బండ్లమూడి శ్రీనివాస్ ట్రస్టీగా ఉన్నారు. ఇందులో 150 మంది వరకూ వృద్ధులు ఆశ్రమం పొందుతున్నారు. చంద్రబాబు, భువనేశ్వరి వృద్ధులను ఆప్యాయంగా పలకరించి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమం నిర్వహిస్తున్న రామ్మోహన్, శ్రీనివాస్ సేవాగుణాన్ని చంద్రబాబు అభినందించారు. సాయిబాబా దేవాలయానికి 3 కి.మీ దూరాన ఈ ఆశ్రమం 1998లో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest