హైదరాబాద్ :
భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునెందుకు ఐక్య ఉద్యమం చెపట్టాలని మాలల జెఎసి రాష్ట్ర చైర్మన్ చెరుకు రాంచదర్,వివిధ రాష్ర దళిత సంఘాల నేతలు మందాల బాస్కర్,తాళ్ళపల్లి రవి,పి.శంకర్ లు పిలుపునిచ్చారు.సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం లింగుపల్లి లో మాలల జెఎసి,మాల మహనాడు,ఓయు జెఎసి,డిబిఎఫ్ తదితర సంఘాల అధ్వర్యంలో భారత రాజ్యాంగ రక్షణ మన కర్తవ్యం పై సమావేశం గురువారంనాడు జరిగింది.ఈ సందర్భంగా మాలల జెఎసి చైర్మన్ చెరుకు రామచందర్ ,మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు తాళ్ళ పల్లి రవి,ఓయు జెఎసి చైర్మన్ మందాల బాస్కర్,డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ లు మాట్లాడుతు డాక్టర్ బి.అర్.అంబేద్కర్ అందించిన రాజ్యాంగం లో స్వేచ్ఛ,సమానత్వం,ప్రజలందరికి సామాజిక,ఆర్ధిక ,రాజకీయ న్యాయాన్ని అందించిన భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బిజెపి కుట్ర చెస్తుందన్నారు. మనిషిని మనిషి గా చూడ నిరాకరించిన మనుధర్మ శాస్త్రన్ని తిరిగి అమలు చెయడం వల్ల బానిసత్వం,అమానుషసత్వం పెరిగిపొతుదన్నారు.ప్రజా సంక్షేమాన్ని, సుస్థిర అభివృద్ధి ని గాలికి వదిలి అధికారం కొరకు విద్వేషాలు రెచ్చగొడుతూ, సమాజాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్న మోడిని గద్దె దిగడం ఖాయమన్నారు.గత నాలుగు దశలు గా జరిగిన ఎన్నికలలో ప్రజలు విద్వేషాలను రగిలించిని బిజెపి ని ఓటు ద్వారా గుణ పాఠం చెప్పబొతున్నారన్నారు.
గత పదేళ్ళు గా అభివృద్ధి ని విస్మరించి ప్రజల మధ్యన విద్వేషాలను రెచ్చగొట్టడం తగదన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని,రిజర్వేషన్ లను ఎత్తివెస్తామని పదే పదే ప్రకటించడం తగదన్నారు.. తెలంగాణ రాష్ట్రం నుండి పన్నుల రూపంలో 12 లక్షల కోట్ల ను వసూలు చేసి రాష్ర్టానికి నిధలు ఖర్చు చేయలేదన్నారు. కార్పొరేట్ల అప్పులను రద్దు చెయ్యడం ద్వారా 16 లక్షల కోట్ల ను అదాని,అంబానీ లాంటి కంపెనీలకు దొచిపెట్టరన్నారు..ప్రజాస్వామ్యాన్ని కి ప్రమాదకరంగా మారి దేవుళ్ళ పేరుతో ఓట్లను అడగటం సిగ్గు చేటన్నారు.సంవత్సారానికి రెండు కొట్ల ఉద్యోగాలను ఇస్తానని,నల్ల ధనాన్ని స్వాధీనం చేసుకొని పెదలకు పంచుతానన్న మోడి హమి ని మరిచరన్నారు. బిసిల జనణన చెపట్టడం లేదన్నారు.ఈ సమావేశంలో దళిత సంఘాల నేతలు తుమ్మ శ్రీనివాస్,కృపాకర్,జె.బాల్ నర్సు,బి.శంకర్,పి.కిరణ్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.