హైదరాబాద్ :
తెలంగాణ లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టింది. పార్లమెంట్ ఎన్నికల వ్యవహారం కూడా ముగిసిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎన్నికలు జరిపించడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. శనివారం జరిగే క్యాబినెట్ భేటీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తీర్మానం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జూన్ మొదటి వారంలో వార్డుల విభజన.. రెండవ వారంలో రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు.మూడవ వారంలో సర్పంచ్ లకు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. జులై మొదటి వారంలో షెడ్యూల్, చివరి వారంలో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 2 లోపు ఎన్నికలు నిర్వహణ చేపట్టాలి.ఆగస్టు 10లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటారు. మధ్యాహ్నం1 గంట వరకు పోలింగ్.. 2గంటల తరువాత లెక్కింపు.. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,814 గ్రామపంచాయతీలు, 88,682 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు.