న్యూ ఢిల్లీ
సార్వత్రిక ఎన్నికల క్రమంలో దేశవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.8,889 కోట్ల మేర విలువైన నగదు, మాదక ద్రవ్యాలు, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
జప్తు చేసిన సొత్తులో మాదక ద్రవ్యాలదే 45 శాతం వాటా అని, రూ.3,958 కోట్ల మేర డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
స్వాధీనం చేసుకున్న సొత్తులో నగదు రూపేణా రూ.849.15 కోట్లు, మద్యం (రూ.814.85 కోట్లు), మాదక ద్రవ్యాలు (రూ.3,958 కోట్లు), బంగారం, వెండి వంటి ఆభరణాలు (రూ.1,260.33 కోట్లు), ఇతర ఉచితాలు (రూ.2006.59 కోట్లు) ఉన్నట్లు ఈసీ తెలిపింది.
Post Views: 50