- దేశ ప్రజల కోసం కాంగ్రెస్.. బహుళ జాతి కంపెనీల కోసం బిజెపి పనిచేస్తుంది
జై జవాన్..జై కిసాన్ కాంగ్రెస్ నినాదం
కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనలో ఏనాడు పూజలను అడ్డుకోలేదు
పంజాబ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కొట్కాపుర(పంజాబ్):
కాంగ్రెస్ పార్టీ దేశంలోని ప్రజల కోసం పనిచేస్తుంటే బిజెపి మాత్రం బహుళ జాతి కంపెనీల కోసం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఆయన పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి అమర్జీత్ కౌర్ సాహో కు మద్దతుగా పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సభల్లో ప్రసంగించారు. బుధవారం సాయంత్రం కొట్కాపుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్ లో ప్రసంగించారు. గురువారం ఉదయం ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ కేంద్రంలో పంజాబ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తదుపరి ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని మచకి కలన్ గ్రామంలో ప్రశ్న-సమాధానం కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం సాయంత్రం బాగా పురాణ లో ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు. దేశంలో ప్రస్తుతం ప్రధానంగా మూడు అంశాల కేంద్రంగా చర్చ జరుగుతుందన్నారు. ఈ దేశ వనరులు, సంపద ఈ దేశ ప్రజలకే చెందాలని మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, యువ నేత రాహుల్ గాంధీ పోరాటం చేస్తుండగా, ఈ దేశంలోని ఆస్తులను, వ్యవస్థలను అమ్మి కొద్ది మందికి కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు. దేశంలో శాంతి, సౌభాతృత్వం వెళ్లి విరియాలని ఇండియా కూటమి ఓవైపు పోరాటం చేస్తుంటే, జాతి, మతం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని బిజెపి కూటమి ప్రయత్నిస్తుందని వివరించారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలి సంపద పంచాలని రాహుల్ గాంధీ నాయకత్వంలో పెద్ద ఎత్తున పాదయాత్ర జరగగా, ప్రస్తుతం అమల్లో ఉన్న ఓబీసీ, బీసీ, ఎస్సీ ల రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బిజెపి కుట్రలు చేస్తుందని విమర్శించారు. దేశ ప్రజల కోసం పాంచ్ న్యాయ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల కోసం ముందుకు రాగా భౌల జాతి కంపెనీలకు మేలు చేసేందుకు బిజెపి కట్టుబడి ఉందని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఇంటి పెద్ద బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయల నగదు జమ చేస్తామన్నారు. తాము మహిళలను మహారాణులుగా చూస్తామన్నారు. కాంగ్రెస్ సర్కారు ఎప్పుడు పేదల గురించే ఆలోచన చేస్తుందని, బిజెపి పేదలకు రూపాయి కూడా ఇవ్వలేదు, అదా నీ, అంబానీ వంటి కొద్ది మంది పెద్దలకు మాత్రం 16 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి, మోడీ 10 ఏళ్ల పాలనలో 100 లక్షల కోట్ల అప్పులు చేసి దేశాన్ని అప్పులకుప్పగా మార్చారని విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం దేశ సంపద పంపిణీ జరగాలి, తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి అదే విధంగా అన్ని చోట్ల రిజర్వేషన్లు పెంచుతామని ఇండియా కూటమి స్పష్టం చేసిందన్నారు. మేం పేదల కోసం ఎప్పుడు పథకాలు ప్రకటించిన బిజెపి వారు మమ్ములను విమర్శిస్తూనే ఉంటారని తెలిపారు. యూపీఏ హయాంలో ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత, రూరల్ హెల్త్ మిషన్, భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ చేసినప్పుడు సైతం వారు విమర్శించారని గుర్తు చేశారు. ప్రాణాలు లెక్కచేయకుండా సరిహద్దుల్లో కాపలాకాస్తున్న వీర జవాన్ల స్థాయిని మోడీ ప్రభుత్వం కార్మికుల స్థాయికి దిగజార్చిందని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తుందని ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల ఆరోగ్య భీమాకు సంబంధించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలని, ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య భీమా పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. మద్దతు ధర, రుణమాఫీ కోసం ఢిల్లీలో రైతులు నెలల తరబడి ఆందోళన చేస్తే మోడీ 10 నిమిషాలు కూడా వారికోసం కేటాయించలేదని ఆ పోరాటంలో వందలాది మంది రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. జై జవాన్ జై కిసాన్ కాంగ్రెస్ నినాదం అన్నారు. నెహ్రూ కాలం నుంచి మొన్నటి మన్మోహన్ సింగ్ కాలం వరకు వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేశామని గుర్తు చేశారు. ఈ దేశంలో హరిత విప్లవం తీసుకువచ్చి వ్యవసాయ ఉత్పత్తులను మూడింతలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదే అన్నారు. రైతు, శ్రామికుల రుణమాఫీకి ఇండియా కూటమి కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో రైతు రుణమాఫీ చేయబోతున్న విషయాన్ని వివరించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతిరోజు 400 రూపాయల కూలి భద్రతను ఇండియా కూటమి కల్పిస్తుంది అన్నారు. ఈ దేశం కోసం దేహాలను ముక్కలు చేసుకున్న చరిత్ర దివంగత ప్రధానులు ఇందిరా, రాజీవ్ గాంధీ లది వారి వారసత్వాన్ని యువనేత రాహుల్ గాంధీ కొనసాగిస్తున్నట్టు వివరించారు. జనాభా దామాషా ప్రకారం ఈ దేశ సంపద, వనరులు పంపిణీ చేయడమే లక్ష్యంగా ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర, మణిపూర్ నుంచి ముంబై వరకు బస్సు యాత్ర చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్థానిక ప్రజలకు వివరించారు.
- Dy CM Bhatti Vikramarka Mallu addresses Punjab election campaign meetings
Kotkapura
Highlighting Congress Party’s commitment to welfare of all sections of people, Telangana Deputy Chief Minister Bhatti Vikramarka Mallu criticised that BJP’s concern is only for the rich and the Multi National Companies.
Mr.Bhatti Vikramarka has been campaigning in Punjab State in support of Faridkot Lok Sabha Congress candidate Amarjeet Kaur Saho in meetings organised in various areas in that State.
Bhatti addressed a corner meeting in Kotkapura Assembly Constituency limits on Wednesday evenng. He addressed a press conference along with Opposition leader of Punjab State Pratap Singh Bajwa at Faridkot Lok Sabha constituency headquarters on Thursday morning. He later participated in Question and Answer session at Machakikalan village followed by a meeting organised at Baga Purana on Thursday evening.
In his meetings , Mr.Bhatti said that the discussion in the country at present was mainly centred around three issues. While All India Congress Committee headed by Mallikarjun Kharge and youth leader Rahul Gandhi were fighting to ensure resources in the country and national wealth belonged to the people, the Modi government has been striving to handover the national assets and selling away public sector institutions to give them away to few individuals.
While INDIA Alliance has been steadfastly advocating for peace and brotherhood in the country, BJP led NDA alliance has been trying to incite hatred among people in the name of religion, caste and community for electoral gains.
While the Congress Party is determined to protect Indian Constitution and democracy and Rahul Gandhi undertook Padayatra to extend reservations and distribute wealth in line with the population ratio of various communities, the BJP is conspiring to do away with existing reservations for OBC, BC and SCs, Mr.Bhatti alleged.
Congress Party came forward with Paanch Nyay for people of this country and BJP is interested to work for the benefit of MNCs. Congress party has promised to deposit Rs one lakh in the account of eldest woman member in the family after it came to power as it wanted to give importance to women’s empowerment. Congress party’s schemes are aimed at improving the lot of poor in the country
In contrast to Congress party’s pro poor approach, BJP has not given a rupee to the poor while it happily waived Rs 16 lakh crore of loans for the big industrialists. In his 10 year rule, Prime Minister Modi borrowed RS.100 lakh crore and pushed the country into a debt trap.
INDIA alliance made it clear that national wealth should be distributed on the basis of population ratio of various categories of people. It promised to increase reservations as in Tamil Nadu where 69 per cent of reservations were being implemented.
BJP always criticised Congress Party whenever it announced schemes for the welfare of poor. He recalled that UPA government was criticised by BJP for introducing Employment Guarantee Scheme, Food security, Rural Health Mission , land reforms and nationalisation of banks.
Mr.Bhatti said that INDIA alliance soon after coming to power would abolish Agniveer scheme. It would extend free health insurance scheme across the country. In Telangana, Congress govt increased Arogya Health insurance limit for poor from Rs. 5 lakh to Rs.10 lakh.
While farmers agitated for several months in Delhi demanding Minimum support price, loan waiver, Prime Minister Modi did not even allocate 10 minutes to talk to them, Bhatti said recalling hundreds of farmers lost their lives in that agitation. Congress party always believed in Jai Jawan Jai Kisan slogan and worked for their welfare right from Nehru’s regime to Manmohan Singh’s tenure. The credit for green revolution and increasing agriculture produce by three times would go to Congress Party alone. INDIA alliance is committed to loan waiver of farmers and workers. The wages under NAREGA would be increased to Rs.400 per day.
Rahul Gandhi has been working with the same dedication of deceased Prime Ministers Indira Gandhi and Rajiv Gandhi who laid down their lives for the country. Rahul Gandhi’s padayatra from Kanya Kumari to Kashmir, Bus Yatra from Manipur to Mumbai was with the objective of distributing national wealth to various categories of people on the basis of their ratio in population, Mr.Bhatti explained to local people in his meetings.