హైదరాబాద్ :
కాంగ్రెస్ ప్రభుత్వంపై బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.ధాన్యం కొనుగోళ్లలో 1000 కోట్ల కుంభకోణం జరిగిందని, ఈ కుంభకోణంలో ఢిల్లీ పెద్దల హస్తం ఉందని ఆయన ఆరోపించారు.తెలంగాణ భవన్ లో ఆదివారం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. సన్నబియ్యం కొనుగోలు విషయంలో కుంభకోణం జరిగింది.ప్రభుత్వంలో ఉండే మంత్రులు, ముఖ్యమంత్రి దీనిపై మాట్లాడటం లేదు.బీ ఆర్ ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంతే స్కాములు.గల్లీ లో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్టుగా రాష్ట్ర కాంగ్రెస్ తీరు ఉంది.రైతులు పడిగాపులు కాస్తున్న, ధాన్యం కొనుగోలు చేయాలని అడుగుతున్న ప్రభుత్వ కొనుగోలు చేయటం లేదు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతుంది కాంగ్రెస్ .ధాన్యం కుంభకోణం లో సుమారు 1000 కోట్లు కుంభకోణం జరిగిందని నేను ఆరోపిస్తున్న.ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు ముడుపులు వెళ్ళాయి.అధికారం లోకి వచ్చిన 50 రోజుల్లోనే పెద్ద ఎత్తున కుంభకోణం తో దోపిడీ చేశారు. ధాన్య కుంభకోణం జెడ్ స్పీడ్ తో జరిగింది అని వ్యాఖ్యానించారు. పొన్నాల లక్ష్మయ్య ఇతర నాయకులు ఉన్నారు.