- సమస్యలు సృష్టించేవారిని త్వరితగతిన బౌండోవర్ చేయండి
- కౌంటింగు రోజున అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకోండి
- గ్రామాల్లో హింసకు తావులేకుండా ముందు జాగ్రత్తలు చేపట్టండి
- జిల్లా ఎస్పీ గౌతమిశాలి
అనంతపురం :
సమస్యలు సృష్టించే వారిని త్వరితగతిన బౌండోవర్ చేయించాలని జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆదేశించారు. ఆత్మకూరు పోలీసు స్టేషన్ ను ఎస్పీ గారు ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పోలీసు స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాలు, అక్కడి తాజా పరిస్థితులపై ఆరా తీశారు. క్రిటికల్ గ్రామాలను తరుచూ సందర్శించి సమస్యలు ఉత్పన్నం కాకుండా, గ్రామాలలో ప్రశాంతత లోపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఫుట్ పెట్రోలింగ్ లు, గ్రామసభలు, కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లపై దృష్టి సారించాలన్నారు. ఎన్నికల కౌంటింగు, ఆ తర్వాత కూడా గ్రామాల్లో హింసకు తావులేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ గారు ఆదేశించారు. ఇటుకలపల్లి సి.ఐ నరేంద్రరెడ్డి, ఎస్సై మునీర్ అహ్మద్ లు పోలీసుస్టేషన్ తనిఖీల్లో పాల్గొన్నారు.
Post Views: 46