బిచ్చగాడు తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో విజయ్ ఇప్పుడు తుఫాన్ సినిమాతో మరో సారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సుమారు నలభై సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన విజయ్ మిల్టన్ దీనికి దర్శకుడు. శరత్ కుమార్, మురళి శర్మ, సత్యరాజ్ ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రెస్ మీట్ బుధవారం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. హీరో , దర్శకుడితో పాటు నిర్మాతలు కూడా పాల్గొన్నారు. యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా హీరో విజయ్ ఆంటోని అన్నారు. తుఫాను వచ్చే ముందు అంత ప్రశాంతంగా ఉన్నట్టు హీరో క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుందని అన్నారు. సుమారు నలభై నిమిషాల పాటు హీరో డైలాగు చెప్పకుండా ఉంటాడని, ఆ తరువాత అతని యాక్షన్ విజృంభణ ఉంటుందని దర్శకుడు విజయ్ మిల్టన్ అన్నారు.
Post Views: 52