“గం..గం..గణేశా”తో అన్ని వర్గాల ఆడియెన్స్ ఎంటర్ టైన్ అవుతారు – హీరో ఆనంద్ దేవరకొండ-Ganesha will entertain the audience

Hero Anand Deverakonda says Gam Gam Ganesha will entertain the audience from all walks of life

Anand Deverakonda’s latest movie is “Gam Gam Ganesha”. Pragathi Srivastava and Nayan Sarika star opposite Anand in this film, which is produced by Kedar Selagamshetty and Vamsi Karumanchi under the banner Hy-Life Entertainment. Uday Shetty makes his directorial debut with this film. “Gam Gam Ganesha” is set for a grand theatrical release on the 31st of this month. In a recent interview, Anand Deverakonda shared the highlights of the movie in the recent media interaction.

– “After ‘Middle Class Melodies,’ we went into lockdown. It was uncertain how long the lockdown would last or if it would ever end. During this period, I started planning my next project. Along with the story of ‘Baby,’ I received the script for ‘Gam Gam Ganesha.’ The script synopsis sent by director Uday Shetty included three words – greed, fear, and conspiracy – which intrigued me. This line was exciting and felt unique, as I enjoy watching crime comedies like ‘Swamy Rara.’ When I saw that movie, I felt that we could create more films like this in Telugu.”

– “The shooting was delayed after the confirmation of ‘Gam Gam Ganesha.’ I was still in character makeover for the movie ‘Baby,’ and it took a few months to come out of it. The second wave of COVID-19 and film union strikes caused further delays. In the second half of the film, there are scenes set in the background of a Ganesha Mandapam. We built a set for these scenes, but it collapsed due to heavy rains. We rebuilt the set and completed the shooting, which took additional time.”

– “In every interview, I am asked why I don’t do hero-centric movies. I thought, why not? With the story of ‘Gam Gam Ganesha,’ I felt confident that I could take on such a role. Unlike my previous ‘boy next door’ image, in this film, I am energetic, I do comedy, I cry when needed, and I am hyper. The character thinks of himself as a hero but doesn’t act like one.”

– “Our director Uday has crafted the screenplay in a way that I believe everyone will enjoy. The story features fifteen main characters, and Uday has succeeded as a debut director in bringing out the best performances from all of them. He is also receiving offers for two or three more films. I am happy and confident about ‘Gam Gam Ganesha.'”

– “Recently, we held special screenings of ‘Gam Gam Ganesha’ for family and youth audiences. They enjoyed and were entertained by the movie. Their positive response has given us more confidence. Despite watching the shooting footage hundreds of times, it still feels fresh. Typically, these action comedies are best enjoyed in a theater setting; the thrill doesn’t translate as well on OTT platforms.”

After hearing the story of “Gam Gam Ganesha,” I was initially afraid that I wouldn’t be able to perfect the comedic timing. We did some workshops and fixed the timing. I have done comedy in “Middle Class Melodies” and “Pushpaka Vimana” in the past, so it comes naturally to me. However, I had to perform a bit more hyperactively in “Gam Gam Ganesha.”

– This story revolves around the idol of Lord Ganesha. Several characters try to obtain the idol, each with bad intentions. The plot centers on the value of the statue and who ultimately gets it. The film also explores themes of fear, greed, and conspiracy, showing how these traits impact the lives of the characters.

– I listen to songs and practice dancing. When I am free at home, my brother Vijay encourages me to practice dance. My father also used to say, “Do you have grace? Learn to dance.” We did a six-minute song in “Baby,” but it was cut to make the film longer. I got the chance to dance in this movie.

– Not only in my films, but my brother Vijay’s films also have rich content. He has done character-driven movies, which is why he gained national recognition with “Arjun Reddy.” “Gam Gam Ganesha” is not a film made to change my image; the story seemed new, and I thought I could try such a script and character. Pragathi Srivastava and Nayan Sarika play the two heroines in our film. Both have significant roles and performed well. Although there are two heroines, “Gam Gam Ganesha” is not a love triangle story.

– As a hero, my span of movies does not increase all at once. I received a grosser of 100 crores with “Baby,” but I don’t expect my next movie to collect more than that. Love stories have a universal reach. We spent six crores on “Gam Gam Ganesha.” If the promotion money is recouped and the film breaks even, and you all give good reviews, it will provide us with a lot of strength and support. There are no movies to watch with family this summer, and “Gam Gam Ganesha” fills that gap.

– Rashmika is our family friend. At the pre-release event, we wanted to make the chit-chat go viral. Chaitan Bharadwaj provided excellent music for “Gam Gam Ganesha,” and the BGM is also impressive. Hy-Life Entertainment is like my home banner. Kedar and Vamsi are my friends, and they supported this film a lot. When the shooting was delayed and the set was destroyed, they completed the film by spending again.

– I love doing raw action movies. I wanted to do films like Dhanush’s “Karnan” and “Asuran.” Now, Vinod Anantoju’s movie with Sitara Entertainment will be in such a format. Director Sai Rajesh, SKN, Vaishnavi, and I are making a film together in the “Baby” combo. Apart from these, I am acting in a duet film with Studio Green, and the shooting of this movie is 50 percent complete.

“గం..గం..గణేశా”తో అన్ని వర్గాల ఆడియెన్స్ ఎంటర్ టైన్ అవుతారు – హీరో ఆనంద్ దేవరకొండ

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “గం..గం..గణేశా” ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. తాజా ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు హీరో ఆనంద్ దేవరకొండ

– మిడిల్ క్లాస్ మెలొడీస్ తర్వాత లాక్ డౌన్ పడింది. ఆ లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. అసలు అది పూర్తిగా వెళ్లిపోతుందో లేదో కూడా అర్థం కాలేదు. అలాంటి టైమ్ లో నా నెక్ట్ మూవీ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఆలోచన మొదలైంది. బేబి కథతో పాటు “గం..గం..గణేశా” స్క్రిప్ట్ కూడా నా దగ్గరకు వచ్చింది. దర్శకుడు ఉదయ్ శెట్టి పంపిన స్క్రిప్ట్ సినాప్సిస్ లో అత్యాశ, భయం, కుట్ర అనే మూడు పదాలు నన్ను అట్రాక్ట్ చేశాయి. ఈ లైన్ ఎగ్జైట్ చేసింది. యూనిక్ గా అనిపించింది. ఎందుకంటే నాకు స్వామి రారా వంటి క్రైమ్ కామెడీస్ చూడటం ఇష్టం. ఆ సినిమా చూసినప్పుడు మన తెలుగులో ఇలాంటివి ఇంకా మరికొన్ని సినిమాలు చేయొచ్చు కదా అనిపించేది.

– “గం..గం..గణేశా” ఒప్పుకున్న తర్వాత షూటింగ్ డిలే అయ్యింది. నేను బేబి మూవీ కోసం ఆ క్యారెక్టర్ మేకోవర్ లో ఉండిపోయాను. అందులో నుంచి బయటకు వచ్చేందుకు కొన్ని నెలల టైమ్ పట్టింది. కోవిడ్ సెకండ్ వేవ్, ఫిల్మ్ యూనియన్ స్ట్రైక్స్ జరగడం..ఇలాంటి వాటి వల్ల డిలేస్ అవుతూ వచ్చాయి. సెకండాఫ్ లో వినాయకుడి మండపం నేపథ్యంలో సీన్స్ ఉంటాయి. వాటికోసం ఒక సెట్ వేశాం. భారీ వర్షాలకు ఆ సెట్ పడిపోయింది. మళ్లీ ఆ సెట్ ను పునర్నిర్మించి షూటింగ్ చేశాం. దానికి కొంత టైమ్ పట్టింది.

– ప్రతి ఇంటర్వ్యూలో మీరు హీరో సెంట్రిక్ మూవీస్ ఎందుకు చేయరు అని అడుగుతుంటారు. ఎందుకు చేయకూడదు అని నాకూ అనిపించింది. “గం..గం..గణేశా” కథతో ఆ ప్రయత్నం చేయొచ్చనే నమ్మకం కలిగింది. నేను గతంలో కనిపించినట్లు ఇందులో పక్కింటి కుర్రాడిలా కనిపించను. ఎనర్జిటిక్ గా ఉంటా, కామెడీ చేస్తా, ఏడవాలనిపిస్తే ఏడుస్తా…హైపర్ గా ఉంటాను. తనను తాను హీరో అనుకుంటాడు గానీ హీరోలా ప్రవర్తించడు.

– నేను పెట్టుకున్న నమ్మకానికి తగినట్లు మా డైరెక్టర్ ఉదయ్ కథను అందరికీ నచ్చేలా స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు. కథలో ఒక పదిహేను కీలకమైన పాత్రలు ఉంటాయి. ఇంతమందితో పర్ ఫార్మ్ చేయించుకోవడంలో ఒక డెబ్యూ డైరెక్టర్ గా ఉదయ్ సక్సెస్ అయ్యాడు. అతనికి మరో రెండు మూడు సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. నేను “గం..గం..గణేశా” పట్ల హ్యాపీగా, కాన్ఫిడెంట్ గా ఉన్నాను.

– ఇటీవల ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ కోసం “గం..గం..గణేశా” స్పెషల్ షోస్ వేశాం. వాళ్లు సినిమా చూస్తున్నంత సేపు ఎంటర్ టైన్ అవుతూ ఎంజాయ్ చేశారు. వాళ్ల రెస్పాన్స్ చూసి మాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. వందలసార్లు మేము షూటింగ్ ఫుటేజ్ చూస్తుంటాం అయినా కొత్తగానే అనిపించేది. సాధారణంగా ఈ యాక్షన్ కామెడీస్ థియేటర్ లో చూస్తేనే ఎంజాయ్ చేయగలరు. ఓటీటీలో ఆ కిక్ రాదు

– “గం..గం..గణేశా” కథ విన్నాక ఇందులోని కామెడీ టైమింగ్ నేను పర్పెక్ట్ గా చేయగలనా అని భయమేసింది. కొన్ని వర్క్ షాప్స్ చేశాం. ఎలాంటి టైమింగ్ ఉండాలో ఫిక్స్ చేసుకున్నాం. నేను గతంలో మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానంలో కూడా కామెడీ చేశా. అది నాచురల్ గా ఉంటుంది. “గం..గం..గణేశా”లో కొంచెం హైపర్ గా పర్ ఫార్మ్ చేయాల్సివచ్చింది.

– వినాయకుడి విగ్రహం చుట్టూ జరిగే కథ ఇది. ఆ విగ్రహం దక్కించుకోవడం కోసం కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్లంతా బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్నవాళ్లు. ఆ విగ్రహంలో అంత విలువైనది ఏముంది. ఎవరికి విగ్రహం దక్కింది అనేది కథాంశం. మనలోనూ భయం, అత్యాశ, కుట్ర అనే లక్షణాలు ఉంటాయి. అవి కొందరి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయి అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం.

– నేను పాటలు వింటూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటా. ఇంట్లో ఖాలీగా ఉంటే అన్న విజయ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయి అంటాడు. మా నాన్న కూడా నీలో గ్రేస్ ఉందిరా డ్యాన్స్ నేర్చుకో అనేవారు. బేబిలో ఓ ఆరు నిమిషాల పాట చేశాం. కానీ సినిమా నిడివికి ఎక్కువవుతుందని కట్ చేశాం. ఈ సినిమాలో డ్యాన్స్ లు చేసే అవకాశం దక్కింది.

– నా సినిమాల్లోనే కాదు అన్నయ్య విజయ్ చిత్రాల్లోనూ రిచ్ కంటెంట్ ఉంటుంది. క్యారెక్టర్ డ్రివైన్ మూవీస్ చేశాడు. అందుకే అర్జున్ రెడ్డి సినిమాతో ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. “గం..గం..గణేశా” నా ఇమేజ్ మార్చుకోవడం కోసం చేసిన సినిమా కాదు. కథ కొత్తగా అనిపించింది ఇలాంటి స్క్రిప్ట్, క్యారెక్టర్ ట్రై చేయొచ్చు కదా అనిపించి చేశా. మా సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక. ఇద్దరికీ మంచి పర్ ఫార్మెన్స్ చేసే స్కోప్ ఉంది. వాళ్లు బాగా నటించారు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా “గం..గం..గణేశా” ట్రయాంగిల్ లవ్ స్టోరి కాదు.

– హీరోగా నా మూవీస్ స్పాన్ ఒక్కసారిగా పెరిగేది కాదు. బేబితో వంద కోట్ల గ్రాసర్ అందుకున్నానని నా నెక్ట్ మూవీ అంతకంటే ఎక్కువ వసూళు చేయాలని అనుకోను. లవ్ సబ్జెక్ట్స్ యూనివర్సల్ కాబట్టి అంత రీచ్ వచ్చింది. మేము “గం..గం..గణేశా”కు ఆరేడు కోట్లు ఖర్చు పెట్టాం. ప్రమోషన్ అన్నీ కలుపుకుని పెట్టిన డబ్బులు తిరిగి వచ్చి బ్రేక్ ఈవెన్ అయ్యి, మీరంతా మంచి రివ్యూస్ ఇస్తే అదే మాకు ఎంతో స్ట్రెంత్, సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది. ఈ సమ్మర్ లో ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు రాలేదు. “గం..గం..గణేశా” ఆ కొరత తీర్చుతుంది.

– రశ్మిక మా ఫ్యామిలీ ఫ్రెండ్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఛిట్ ఛాట్ వైరల్ కావాలనే చేశాం. “గం..గం..గణేశా”కు చేతన్ భరద్వాజ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. బీజీఎం కూడా ఆకట్టుకుంటుంది. హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ నా హోమ్ బ్యానర్ లాంటిది. కేదార్, వంశీ నా ఫ్రెండ్స్. ఈ సినిమా కోసం వాళ్లు ఎంతో సపోర్ట్ చేశారు. షూటింగ్ డిలేస్, సెట్ పాడయినప్పుడు మళ్లీ ఖర్చు పెట్టి సినిమా కంప్లీట్ చేశారు.

– నాకు రా యాక్షన్ మూవీస్ చేయడం ఇష్టం. ధనుష్ కర్ణన్, అసురన్ మూవీస్ లా సినిమాలు చేయాలనే కోరిక ఉండేది. ఇప్పుడు వినోద్ అనంతోజు సితార ఎంటర్ టైన్ మెంట్స్ కాంబోలో చేస్తున్న మూవీ అలాంటి ఫార్మేట్ లోనే ఉంటుంది. డైరెక్టర్ సాయి రాజేశ్, ఎస్ కేఎన్, వైష్ణవి, నేను కలిసి బేబి కాంబోలో ఓ మూవీ చేస్తున్నాం. వీటితో పాటు స్టూడియో గ్రీన్ వారి డ్యూయెట్ సినిమాలో నటిస్తున్నా. ఈ సినిమా 50 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest