ఆంధ్రాలో ఆ నాలుగు న్యూస్ చానెల్స్ బంద్

అమరావతి (07మై 2024):
ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చానెల్స్ ను బంద్ చేసినట్టు జనం మాట్లాడుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఏకపక్షంగా జగన్ కు మద్దత్తు తెలిపిన ఛానెల్స్ ను అక్కడి కేబుల్ ఆపరేటర్లు ఆపేసినట్లు సమాచారం అందుతోంది. గత మూడురోజుల నుంచే ఈ తతంగం నడుస్తోందని సమాచారం. టీవీ9 , ఎన్ టివి, సాక్షి, 10టివి లను కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్లు బ్యాన్ చేసినట్లు జనం మాటాడుకుంటున్నారు. అంతేకాదు జగన్ ప్రభుత్వం పడిపోయిన మరుసటి రోజు నుంచి ఏకంగా పన్నెండు లక్షల సాక్షి పేపర్ సర్క్యులేషన్ కూడా పని పోయినట్టు మీడియాలో చర్చ జరుగుతోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest