కమల్ హాసన్ ను మించిన నటుడు జగన్ రెడ్డి

• రాష్ట్రంలో పెద్ద పెత్తందారీ ముఖ్యమంత్రే
• రాష్ట్రాన్ని దోచేస్తున్నది ఆ అయిదుగురు పెత్తందార్లే
•జగన్ ఎక్కడకి షిఫ్ట్ కావాలో కోర్టులే చెబుతాయి
• అప్పుల కోసమే అంకెల గారడీ చేస్తున్నారు
• అన్ని రంగాలను, వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తున్నారు
• జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు  షేక్ రియాజ్

అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ నటుడు ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి జగన్ రెడ్డేనని, కమల్ హాసన్ రేంజ్ దాటి ఆయన్ని మించి నటించడం జగన్ కు మాత్రమే సాధ్యమని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు  షేక్ రియాజ్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికలకు ముందు తండ్రి లేని బిడ్డను.. మీరే నన్ను చూసుకోవాలని పాదయాత్రలో నట విశ్వరూపం చూపించిన జగన్ రెడ్డి. ఇప్పుడు ప్రతిపక్షాలను తోడేళ్లతో పోలుస్తూ మీరే అండగా ఉండాలని మాట్లాడటం హాస్యస్పదంగా ఉందని అన్నారు. ఈ రాష్ట్రంలో మనిషి రూపంలో ఉండే తోడేలు ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి జగన్ రెడ్డేనని అన్నారు. మంగళవారం హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి  సుందరపు విజయ్ కుమార్ తో కలిసి మాట్లాడారు.
ఈ సందర్భంగా  షేక్ రియాజ్ మాట్లాడుతూ “తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని కుట్రలు చేసే మనిషికి ప్రతిపక్షాల మీద అర్థంలేని కామెంట్స్ చేస్తున్నారు. మా పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  గురించి మాట్లాడే అర్హత లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు పేదలకీ, పెత్తందార్లకీ మధ్య పోటీ అని ముఖ్యమంత్రి మాట్లాడటం సిగ్గుచేటు. దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. అంత సంపద ఆయనకు ఎక్కడ నుంచి వచ్చింది? తాతలు, తండ్రుల ఇచ్చారా? లేకపోతే ప్రజల నుంచి దోచుకున్నారా? ప్రజలకు సమాధానం చెప్పాలి. నువ్వు పెంచి పోషిస్తోన్న తోడేళ్ల గుంపు రాష్ట్రంలో భూకబ్జాలకు పాల్పడుతూ వేల కోట్లు దోచుకుంటుంది.
• జగన్.. ఎక్కడికి వెళ్లాలో న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి
విశాఖపట్నమే ఆంధ్రప్రదేశ్ రాజధాని. త్వరలోనే అక్కడికి వెళ్లిపోతామని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. విశాఖకు వెళ్తాడో… లేకపోతే జైలుకు వెళ్తాడో న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. మీ బాబాయ్ కేసులో సీబీఐ ఆధారాలు సేకరిస్తోంది. త్వరలోనే నిన్న తీహార్ జైలుకు పంపాలా? లేకపోతే విశాఖ జైల్లో ఉంచాలా? అనేది న్యాయస్థానాలే తేలుస్తాయి. అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో ఇంటిపన్ను పెంచేశాడు, కరెంటు ఛార్జీలు పెంచేశాడు, అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోలు, డీజిల్ రేటు ఎక్కువ. చివరకు చెత్తపై కూడా ట్యాక్స్ వేశారు. రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చేశారు.
• మీ ఐదుగురు దోచుకొంటున్న మాట వాస్తవం కాదా?
హోంశాఖ మంత్రి దళిత సోదరి వనిత  ఒక్క పోలీస్ కానిస్టేబులునైనా బదిలీ చేయించగలరా? ఉప ముఖ్యమంత్రి  అంజాద్ బాషా ఒక్క మసీదుకైనా లక్ష రూపాయలు నిధి ఇప్పించగలరా? మేధావి అని చెప్పుకొనే మేరుగు నాగార్జున ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఎస్సీల కోసమే వినియోగించాలని ముఖ్యమంత్రికి చెప్పగలరా? అసలు ఈ రాష్ట్రంలో పెద్ద పెత్తందారు ముఖ్యమంత్రే. ఆయన ముందు మాట్లాడే దమ్ము ఎమ్మెల్యే, మంత్రులకు లేదు. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డి, కడప జిల్లాకు చెందిన సజ్జల రామకృష్ణ రెడ్డి, చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనే పెత్తందార్ల మాటే వినిపిస్తుంది. సీఎంతో సహా అయిదుగురు పెత్తందార్లు చేస్తున్న దోపిడి నుంచి ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నశ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజల మద్దతు లభిస్తోంది. ఈ ఆదరణ చూసిన భయంతోనే జగన్ ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారు” అన్నారు.

• మీ బిడ్డ అంటూనే మన బిడ్డల భవిష్యత్తు తుంచేస్తున్నాడు :  సుందరపు విజయ్ కుమార్
జనసేన పార్టీ అధికార ప్రతినిధి  సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ “మాటకు ముందొకసారి.. తర్వాత మరోసారి మీ బిడ్డ… మీ బిడ్డ అని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని బిడ్డలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి. దొంగ లెక్కలు… సూట్ కేసు కంపెనీలు పెట్టి మోసం చేయడాన్ని అలవాటు చేసుకున్న ఆయన ఇప్పుడు మళ్లీ అదే బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ వృద్ధిరేటు ఏకంగా 11.43 శాతంగా దూసుకుపోతోందని చెబుతున్న ముఖ్యమంత్రి దానికి సంబంధించి కేంద్రానికి ఏ లెక్కలు పంపారో బయటపెట్టాలి. రాష్ట్రంలో దొంగ లెక్కలు, కాకి లెక్కల పాలన నడుస్తోంది. ఇప్పుడు ఎక్కడ దొంగలెక్కలు, కాకి లెక్కలు బయటపడినా…. జగన్ లెక్కలు అనే దౌర్భగ్య పరిస్థితి ఉంది. దొంగ లెక్కలకు కేరాఫ్ గా మారిన జగన్ రెడ్డి మన రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. అప్పుల కోసం రాష్ట్ర పరిస్థితిని కొండంతలు చేసి చూపుతున్నారు. భారీ ఆర్థిక వృద్ధి లెక్కలును కేంద్రానికి పంపుతున్నారు. ఫలితంగానే జీఎస్డీపీలో భారీ వృద్ధి రేటు సాధ్యమైంది. సంక్షేమం పేరుతో డబ్బులు పంచుతున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి వాస్తవ పరిస్థితులను తెలుసుకోకపోవడం శోచనీయం. అస్మదీయులు, తస్మదీయులకు మాత్రమే సంక్షేమం అందుతోంది. వైసీపీ నాయకులు చెప్పిన వారికే సంక్షేమ ఫలాలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం మీద నాయకుల మీద ఏ మాత్రం నోరుజారినా వెంటనే సంక్షేమ ఫలాల జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇదేనా మీరు చెబుతున్న బిడ్డ పాలన..? ఒక ఏడాది సంక్షేమ పథకాలకు అర్హులైన వారు మరో ఏడాది ఎందుకు కాకుండాపోతున్నారు. దీనిలో ఏ మతలబు దాగుందో చెప్పాలి. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను, రంగాలను విచ్ఛిన్నం చేశారు.
• నేరాల్లో… గంజాయి సాగులో నంబర్ 1
జీఎస్డీపీలో రాష్ట్రం దేశంలో నంబరు 1గా ఉందని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరం. కానీ రాష్ట్రం నేరాల్లో, గంజాయి సాగు, నిరుద్యోగిత రేటులో కూడా ముందుంది. అప్పుల్లో సైతం అగ్రభాగాన నిలుస్తోంది. దీనిని ఎందుకు ప్రస్తావించరు..? రాష్ట్రంలో అన్ని వర్గాలు వృద్ధి సాధిస్తున్నాయని చెబుతున్న సీఎం చుట్టూ ఉన్న ఆయన సొంత సామాజిక వర్గ పెద్దలే వృద్ధి సాధిస్తున్నారని తెలుసుకోవాలి. రాష్ట్రాన్ని వారికి రాసిచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. దళిత మహిళకు హోంమంత్రిత్వ శాఖ ఇచ్చి కనీసం కానిస్టేబులుని బదిలీ చేసే అధికారం కూడా ఇవ్వలేదు. ఇదేనా మీరు సాధించిన సాధికారత..? ఆయన చుట్టూ ఉన్న కోటరీకి మించి మరే పెత్తందారీలు రాష్ట్రంలో ఉండరు. కాబట్టి పేదలకు, మీ ప్రభుత్వ పెత్తందారీలకే ఈసారి పోటీ అనేది అందరికీ అర్ధం అయింది. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్రజలందరికీ దత్తపుత్రుడుగా మారిపోయారు. ఏ కష్టం వచ్చినా ఇంట్లోని పెద్ద కొడుకుగా నిలబడుతున్నారు. కచ్చితంగా ఆయన కళ్లలో నిజాయతీ, నిబద్ధత ఉంది’’ అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest