మీడియా చిట్ చాట్ లో గుత్తా సుఖేందర్ రెడ్డి-14 వరకు బడ్జెట్ సమావేశాలు

హైదరాబాద్
తెలంగాణ శాసన మండలిలోని తన ఛాంబర్ లో మీడియా మిత్రులతో చిట్ చాట్ నిర్వహించిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి .

చిట్ చాట్ లో గుత్తా సుఖేందర్ రెడ్డి  మాట్లాడిన అంశాలు

👉తెలంగాణ ప్రభుత్వం,గవర్నర్ మధ్య వివాదం సర్దుకుంటుందని ముందే చెప్పా

👉ఈ సారి 14 వరకు బడ్జెట్ సమావేశాలు ఉండొచ్చు అనుకుంటున్నాము

👉తమిళనాడు తరహాలో తెలంగాణలో గవర్నర్ ప్రసంగం ఉండదని అనుకుంటున్న

👉కేంద్రం చెప్పినట్లు రాష్ట్రాల గవర్నర్లు వ్యవహరిస్తున్నారు

👉సంపూర్ణ రుణమాఫీ,సొంత జాగా వున్న వారికి ఇళ్ళ నిర్మాణం కోసం 3 లక్షలు ఈ రెండు నెరవేరాల్సి ఉంది.

👉నా కుమారుడికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంది. పోటీ చేయాలా వద్దా అనేది పార్టీ నిర్ణయిస్తుంది

👉బిఆర్ఎస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఆదరణ ఉంటుంది

👉కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ శూన్యత ఉంది.

👉నల్గొండలో ఈసారి బీఆర్ఎస్ కు మంచి స్థానాలు వస్తాయి

👉వామపక్షాల పొత్తు కలిసి వస్తుంది

👉జనరల్ ఎన్నికలకు,సాధారణ ఎన్నికలకు తేడా ఉంటుంది

👉ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సామర్ధ్యాన్ని బట్టి ఖర్చు ఉంటుంది.

👉గిరిధర్ గమాంగ్ సీనియర్ నాయకుడు.రాజకీయ నాయకుల పని అయిపోయిందని భావించవద్దు.నీలం సంజీవరెడ్డి చాలా ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండి ఎంపీ,లోక్ సభ స్పీకర్,రాష్ట్రపతి అయ్యారు

👉గవర్నర్ ప్రసంగం సాఫీగా జరగాలని ఆశిస్తున్నాం.

టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారినా పార్టీ సింబల్,నాయకుడు మారలేదు దీని వల్ల ఇబ్బంది వుండదు

👉తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలు తమకు కావాలని ఇతర రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు

👉గవర్నర్ తో విభేదాలు వస్తాయి…పోతాయి

👉గవర్నర్,ప్రభుత్వం,అసెంబ్లీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి.ఇందులో ఎవరి విజయం ఉండదు.

👉నాకు మంత్రి జగదీష్ రెడ్డికి విభేదాలు లేవు.నేను ఎవరితో పంచాయతీ పెట్టుకోను.నేను ఏ వ్యవహారాల్లో తలదూర్చను

👉తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ప్రభావం ఉండదు. కర్ణాటకలో ఉండొచ్చు.

👉 దేశ వ్యాప్తంగా చట్ట సభలు నడిచే సమయం తగ్గుతోంది.

👉ప్రతి సంవత్సరం 60 రోజులు సభలు నడవాలని గతంలో చర్చ జరిగింది

👉టిడిపి చచ్చిపోయిన పార్టీ.ఇప్పుడు దానికి జీవ గంజి పోసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఏం కాదు.

👉విపక్ష సభ్యులకు సభలో మాట్లాడటానికి తగిన సమయం ఇస్తాం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest