APFDC ఛైర్మన్ గా పోసాని బాధ్యతల స్వీకరణ

అమరావతి :

చిత్ర టి&వి నాటకరంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా సిని నటుడు, రచయిత, దర్శకుడు పోసాని మురళికృష్ణ పదవి బాధ్యతలు స్వరీకరించారు. మొదటి కళాతపస్వీ విశ్వనాథ్,డైరెక్టర్ సాగర్ మృతి సందర్భంగా మౌనం పాటించి వారి చిత్రపటాలకు పూల మాలలు వేశారు.అనంతరం మేనేజింగ్ డైరెక్టర్ ఎఫ్ డిసి విజయకూమార్ మాట్లాడుతూ పోసానికి శుభాకాంక్షలు తెలిపారు. పోసాని అన్ని క్రాఫ్ట్ లలో మంచి సంభంధం కలిగిన వ్యక్తి ని నియమించిన ఎపిలో సినిమా రంగానికి చేయూత నివ్వాలని కోరారు.అనంతరం మాజీ మంత్రి పేర్నీ నాని,లక్ష్మిపార్వతి,స్థానిక ఏమ్మేల్యే విష్ణు,ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి పుష్ప గుఛ్చాలు అందచేసి శాలువాతో సత్కరించారు.

అనంతరం ఎఫ్ డిసి నూతన ఛైర్మన్ పోసాని మురళి కృష్ణ మాట్లాడుతూ డైరెక్టర్ సాగర్,విశ్వనాథ్ మధ్య చాలా తేడ ఉంది. సాగర్ మంచి మానతావాధి అని,విశ్వనాథ్ గోప్ప డైరెక్టర్ అన్నారు. మాకు రాజకీయం పరిచయం చేసింది గోతమ్ రెడ్డన్నారు.జగన్మోహన్ రెడ్డి పదవి ఇస్తారని అనుకోలేదన్నారు.ఆయనను దూరంగా చూస్తు ఇష్టపడే వాడినని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి జనం నుండి పుట్టేరని అన్నారు.

 

సినిమా ఇండస్ట్రీకి చెడు చేయనని,అబద్దాలు చెప్పనని,ఆకాశం నుండి చుక్కలు దింపనని జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తెస్తానని అన్నారు.అతి త్వరలో AP లో నంది అవార్డ్స్ , రాయితీలు షూటింగ్స్ జరపడం కోసం కావలసిన సదుపాయాలు ని ఏర్పాటు చేస్తాను అని పోసాని తెలిపారు.


సీఎం పదవి ఇస్తారని రాజకీయాల్లోకి రాలేదు. ఏనాడు జగన్‌ను కలవలేదు. జనాల్లోంచి పుట్టిన నాయకుడు జగన్‌.. అందుకే నాకు ఇష్టం.. సినీ పరిశ్రమకు ఎంత మంచి చేస్తానో తెలియదు. కానీ, చెడు మాత్రం చేయను.. ఊపిరి పోయే వరకు సీఎం జగన్‌తోనే ఉంటా.


రంగ రంగ వైభవంగా APFDC చైర్మన్ గా పోసాని కృష్ణ మురళి ప్రమాణ స్వీకారం.హాజరైన మాజీ మంత్రి పేర్ని నాని.నిర్మాతల మండలి అధ్యక్షుడు.సి.కళ్యాణ్..మోహన్ వడ్లపట్ల ..తుమ్మలపల్లి రామ సత్యనారాయణ.బాసిరెడ్డి.అనుపమ రెడ్డి.బాపిరాజు.అలంకార ప్రసాద్.సాయి.ఒంగోలు బాబు..pLK రెడ్డి తదితరులు హాజరయ్యారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest