న్యూ ఢిల్లీ (5 మే 2024):
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రాజీనామా రాష్ట్రపతికి సమర్పించిన తరువాత బుధవారం సాయంత్రం ఎన్ డి ఏ కూటమి ఢిల్లీలో భతి అయింది. ఎన్డీఏ లో ఉన్న అన్ని 20 పార్టీలు ఈ సమావేశంలో కలిశారు. మోడీకి తమ పద్దత్తు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కూటమి నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. చిన్న పార్టీల నుంచి మొగ్గురు ఎంపీలను, ఏడుగురు స్వతంత్ర ఎంపీలను కూడా ఎన్డీఏ కూటమిలో చేర్చుకునేందుకు అమిత్ షా ఇప్పటికే మంతనాలు షురూ చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మోడీ ప్రభుత్వంలో స్వతంత్ర ఎంపీలను , చిన్న చిన్న పార్టీల ఎంపీలను కూడా కలుపుకుపోవాలని బీజేపీ భావిస్తోంది.
ఎన్డీఏ కూటమిలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలకంగా మారారు. ఈనెల 7వ తేదీన మరోసారి ఎన్డీఏ సమావేశం కానుంది.
మళ్లీ 7న ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. 7న బీజేపీ పార్లమెంటరీ భేటీ తర్వాత ఎన్డీఏ భేటీ జరుగనుంది.
ఎన్డీఏ భేటీకి కూటమి ఎంపీలు అందరూ హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజే రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ఎన్డీఏ నేతలు కోరనున్నారు. ఈనెల 9న ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది.