హైదరాబాద్
సీనియర్ జర్నలిస్టు రవి ప్రకాష్ నేతృత్వంలో నడుస్తున్న ఆర్ టివి సర్వే విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలవబోతోంది అని రవి ప్రకాష్ సర్వే తెలిపింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కలిసి కూటమిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. మరి కొద్దీ గంటల్లో రిజల్ట్ రానున్న నేపథ్యంలో రవి ప్రకాష్ సర్వే ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఆసక్తి రేపుతోంది.
RTV రవి ప్రకాష్ పోస్ట్ పోల్ సర్వే వివరాలు…
సినారియో – 1(175)
టీడీపీ+జనసేన+బీజేపీ = 120
వైస్సార్సీపీ – 53
కాంగ్రెస్ – 2
సినారియో – 2(175)
టీడీపీ+జనసేన+బీజేపీ = 150
వైస్సార్సీపీ – 23
కాంగ్రెస్ – 2
వైసీపీ ఓటమికి పలు కారణాలు…
1. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ క్యాడర్ కసిగా పనిచేయడం.
2. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తమ భూమిపై హక్కులు ప్రభుత్వానికి వెళ్లిపోతాయన్న భయం.
3. మద్యంలో చీప్ బ్రాండ్లు, అత్యధిక రేట్లు.
4. రోడ్లు దారుణంగా ఉండటం.
5. 60 గజాల ఇళ్లస్థలాలే ఇవ్వడం, అదీ ఊరుకు దూరంగా, మునిగిపోయే చోట ఇచ్చారని మహిళల్లో అసంతృప్తి.