ఇక డిజిటల్ లావాదేవీలే :మోడీ వ్యాఖ్య
న్యూ ఢిల్లీ :
దేశంలో నగదు లావాదేవీల కన్నా డిజిటల్ లావాదేవీలే ఎక్కువగా జరుగనున్నాయని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. డిజిటల్ ట్రాంజస్కషన్ లో దేశం వేగంగా ముందుకు వెళ్తోందని చెప్పారు. వీధి వ్యాపారాల నుంచి అన్ని బిజినెస్ వరకు క్యూ ఆర్ కోడ్ ఉపయోగించి లావాదేవీలు జరుగుతున్నాయని చెప్పారు. యుపిఐ , సింగపూర్ పే నౌ సంస్థల మధ్య అనుసంధానానికి సంబంధించిన క్రాస్ బోర్డర్ కనెక్టివిటిని మంగళవారం ప్రధాని మోడీ ప్రారంభించారు. వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ కూడా పాల్గొన్నారు. ఈ ఎం ఓ యూ ఆర్ బి ఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, మానెటరీ అథారిటీ అఫ్ సింగపూర్ మేనేజింగ్ డైరెక్క్టర్ రవి మే నాన్ మధ్య జరిగింది. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ 2022 లో 74 బిలియన్ల లావాదేవీలు జరిగాయని , వాటి విలువ రూ. 126 లక్షలు ఉంటుందని మోడీ చెప్పారు. ఈ ఒప్పందం వాళ్ళ ఇరు దేశాల్లోని పోర్టులకు ఎంతో ప్రయోజనం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా సింగపూర్ లోని భారతీయులకు సులువుగా మని ట్రాన్స్ ఫర్ సులభతరం అవుతుందని మోడీ చెప్పారు.