TSRTC ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించిన రేవంత్ సర్కారు

హైదరాబాద్ :

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్‌మెంట్‌తో శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.కాగా, ఇటీవల హైదరా బాద్‌లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో 2023- 24 ఉత్తమ ఉద్యోగులు, అధికారులకు సంస్థ ఎండీ సజ్జనార్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కా రాలు అందజేశారు.అనంతరం మంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీకి సంబంధించిన వినతిపత్రం సమర్పించారు. ఈ సంద ర్భంగా మంత్రి పొన్నం వారికి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారా నికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.హామీ ఇచ్చిన రెండ్రోజుల్లో ప్రభుత్వం మాట నిలబెట్టు కోవడంతో ఆర్టీసీ ఉద్యోగు లకు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest